Jahnavi Dangeti: సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన జాహ్నవి దంగేటి

Jahnavi Dangeti Meet AP CM YS Jagan in  - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి బుధవారం కలిశారు. నాసా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించిన మొదటి ఇండియన్‌గా జాహ్నవి గుర్తింపు తెచ్చుకున్నారు. రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ నుంచి వరద బాధితులను పరామర్శించేందుకు బయలుదేరుతున్న ముఖ్యమంత్రిని కలిసి.. పైలెట్‌ ఆస్ట్రొనాట్‌ అవ్వాలన్న తన కోరికను వివరించి, ఇందుకు అవసరమైన శిక్షణకు అయ్యే ఖర్చుకు సాయం చేయాల్సిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు.
చదవండి: వరద బాధితులందరికీ న్యాయం చేస్తాం: సీఎం జగన్‌ 

భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌లా అంతరిక్షంలోకి అడుగుపెట్టాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నట్లు సీఎంకి వివరించింది. జాహ్నవి విజ్ఞప్తిపై సీఎం జగన్‌.. సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, జాహ్నవి కుటుంబ సభ్యులు ఉన్నారు.
చదవండి: అమ్మమ్మ కథలు.. అస్ట్రోనాట్‌ కలలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top