
Updates
పశ్చిమగోదావరి జిల్లా:
►నరసాపురం పట్టణం 8,9 వ వార్డు లలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, మున్సిపల్ చైర్ పర్సన్ బర్రె వెంకటరమణ
ఏలూరు జిల్లా:
►కైకలూరు మండలం పెంచికలమర్రు గ్రామంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ
ఎన్టీఆర్ జిల్లా :
►తిరువూరు పట్టణంలోని ఒకటో వార్డులో "జగనన్నే మా భవిష్యత్తు- నువ్వే మా నమ్మకం జగన్ కార్యక్రమంలో గృహసారథులు సచివాలయ కన్వీనర్లు వాలంటీర్లతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి
తిరుపతి జిల్లా:
►"జగన్ అన్నే మా భవిష్యత్తు" కార్యక్రమంలో భాగంగా పిచ్చాటూరు మండలం కీలపూడి గ్రామంలో ఇంటింటికి వెళ్లి జగనన్న సంక్షేమం పథకాలను వివరిస్తూ, తలుపులకు, ఫోన్ లకు జగనన్న స్టిక్కర్ లను అతికించి, సర్వే నిర్వహించిన స్ధానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, పార్టీ శ్రేణులు, వాలంటీర్లు గృహసారథులు, సచివాలయం కన్వీనర్లు
తిరుపతి జిల్లా:
►కొర్లగుంట మారుతీ నగర్ లో కొనసాగుతున్న ఎమ్మేల్యే భూమన కరుణాకర్ రెడ్డి జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం
►ఇంటి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పై లబ్ధి దారులనుంచి వివరాలు సేకరిస్తు ప్రజా మద్దతు పుస్తకంలో నమోదు చేస్తున్న ఎమ్మెల్యే భూమన
మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్ లను ప్రతి ఇంటికీ సంక్షేమ పథకం లబ్ధి దారులు సంతోషంగా అతికిస్తున్నారు
ఎన్టీఆర్ జిల్లా:
చందర్లపాడు మండలం వెలదికొత్తపాలెం గ్రామంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు
నెల్లూరు జిల్లా:
ఇందుకూరుపేట (మం) కొత్తూరులో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం నిర్వహించిన కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి..
►ఏపీ వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో రెండో రోజు ‘జగనన్నే మా భవిష్యత్’ కార్యక్రమం ప్రారంభమైంది. సచివాలయానికి ముగ్గురు చొప్పున నియమించిన కన్వినర్లు, ప్రతి 50 నుంచి వంద ఇళ్లకు ఇద్దరు చొప్పున నియమించిన గృహ సారథులతో కూడిన ఏడు లక్షల మంది సైన్యం ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది.
►దీనికి సంబంధించి వారికి ప్రత్యేకమైన కిట్ బ్యాగ్‌లు అందచేశారు. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఆయా నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తారు. 14 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా 15,004 సచివాలయాల పరిధిలో 1.60 కోట్ల కుటుంబాలలోని ఐదు కోట్ల మంది ప్రజలను కలుసుకోనున్నారు.
►గత 46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రజలకు చేస్తున్న మేలును వివరించి.. ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా సాగిస్తున్న దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 14 వేలకుపైగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిర్వహించాయి.
తొలి రోజు ఘనమైన ఆహ్వానం
ఏ ఇంటికి వెళ్లినా ఆత్మీయ పలకరింపులు.. ప్రభుత్వ పనితీరుపై ఎవరిని కదిపినా హర్షాతిరేకాలు.. మళ్లీ జగనన్నే సీఎం కావాలన్నది తమ ఆకాంక్షగా ప్రజా మద్దతు పుస్తకంలో నమోదు చేయాలని అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముల ఆశీర్వచనాలు.. వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఇంటి తలుపు, మొబైల్ ఫోన్‌కు వైఎస్ జగన్ ఫొటోతో కూడిన స్టిక్కర్‌లను అతికించుకోవడానికి పోటీ పడ్డ అక్కచెల్లెమ్మలు.. 82960 82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి, మద్దతు తెలిపిన వెంటనే సీఎం వైఎస్ జగన్ సందేశంతో ఐవీఆర్‌ఎస్ కాల్ రావడంతో కేరింతలు.. వెరసి మా నమ్మకం నువ్వే జగన్.. అంటూ నినాదాలు.. ఇదీ వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి తొలి రోజున వచ్చిన స్పందన.
ప్రతి ఇంటా ఎదురేగి ఆహ్వానం
సీఎం వైఎస్ జగన్ ప్రతినిధులుగా ఇంటికి వచ్చిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, సచివాలయాల కన్వీనర్లు, గృహ సారథులు, పార్టీ శ్రేణులు, వలంటీర్లకు కుటుంబ సభ్యులు ఎదురేగి ఆహ్వానించారు. టీడీపీ సర్కార్‌కూ ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలను వివరిస్తూ కరపత్రాన్ని చదివి వినిపించినప్పుడు.. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తమతోపాటు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారనే మాట ప్రతి ఇంటా విన్పించింది. గత 46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలతో తమకు అండదండగా సీఎం వైఎస్ జగన్ నిలుస్తున్నారని అవ్వాతాతలు, అక్కాచెల్లెమ్మలు సంతోషం వ్యక్తం చేశారు.
ప్రజా సర్వేలో భాగంగా ప్రజా మద్దతు పుస్తకంలో స్లిప్పులలోని ఐదు ప్రశ్నలను గృహ సారథులు వినిపించినప్పుడు.. వైఎస్ జగన్ ప్రభుత్వంతోనే తమకు న్యాయం జరిగిందని, మళ్లీ సీఎంగా వైఎస్ జగనే కావాలంటూ సమాధానాలు చెప్పి.. వాటిని నమోదు చేయించి, రసీదు తీసుకున్నారు. రసీదు తీసుకున్నాక గృహ సారథులు అడగక ముందే.. వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 82960 82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చారు. ప్రభుత్వానికి మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం వైఎస్ జగన్ సందేశంతో ఐవీఆర్‌ఎస్ కాల్ రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. గృహ సారథుల వద్ద నుంచి వైఎస్ జగన్ ఫొటో ఉన్న స్టిక్కర్లను తీసుకుని.. ఇంటి తలుపునకు, మొబైల్ ఫోన్‌కు అతికించి.. ‘జగనన్నే మా భవిష్యత్’ అంటూ నినదించారు.