‘రియల్‌’ ఒప్పందాల స్టాంప్‌ డ్యూటీపై మార్గదర్శకాలు జారీ | Issued guidelines on stamp duty on real estate sector | Sakshi
Sakshi News home page

‘రియల్‌’ ఒప్పందాల స్టాంప్‌ డ్యూటీపై మార్గదర్శకాలు జారీ

Dec 17 2021 5:10 AM | Updated on Dec 17 2021 5:10 AM

Issued guidelines on stamp duty on real estate sector - Sakshi

సాక్షి, అమరావతి: రియల్‌ ఎస్టేట్‌ రంగంలో జరిగే అభివృద్ధి, విక్రయ–జీపీఏ ఒప్పందాలకు కట్టే స్టాంప్‌ డ్యూటీకి సంబంధించిన అంశాలపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ స్పష్టత కోసం కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ మేరకు ఆ శాఖ ఐజీ అండ్‌ కమిషనర్‌ రామకృష్ణ అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు 2 మెమోలు జారీ చేశారు.

అపార్ట్‌మెంట్లు నిర్మించే ముందు భూ యాజమాని, డెవలపర్‌ మధ్య జరిగే ఒప్పందాలు, నిర్మాణం తర్వాత విక్రయ–జీపీఏ (సేల్‌ కం జీపీఏ అగ్రిమెంట్లు)ఒప్పందాలకు స్టాంప్‌ డ్యూటీ కట్టించుకునే విషయంలో చాలాకాలం నుంచి కొన్ని అనుమానాలు, అస్పష్టతలు ఉన్న విషయం కమిషనర్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన వాటిని పరిష్కరించేందుకు పలు ఆదేశాలిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement