భారీగా అక్ర‌మ మ‌ద్యం ప‌ట్టివేత‌ | Illegal Liquor Seized And Police Have Arrested Four Accused | Sakshi
Sakshi News home page

భారీగా అక్ర‌మ మ‌ద్యం ప‌ట్టివేత‌

Sep 22 2020 7:08 PM | Updated on Sep 22 2020 7:12 PM

Illegal Liquor Seized And Police Have Arrested Four Accused - Sakshi

సాక్షి, గుంటూరు :  ఇత‌ర రాష్ర్టాల నుంచి అక్ర‌మంగా మ‌ద్యం త‌ర‌లిస్తున్న నిందితుల‌ను పోలిసులు అరెస్ట్ చేశారు.  శావల్యాపురం మండలం కారుమంచిలో భారీగా మద్యం పట్టుబ‌డింది. గ్రానైట్ లారీల ద్వారా మద్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. తెలంగాణ, గోవా రాష్ట్రాల నుంచి తెచ్చిన 4,764 బాటిళ్ల మద్యాన్ని పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు  రూ.13.58 లక్షలు ఉన్నట్లు  గుర్తించారు. ఈ కేసులో నలుగురు నిందితుల‌ను అరెస్టు చేశారు. అక్ర‌మ మ‌ద్యం, ఇసుకపై ప్రభుత్వం సీరియస్‌గా  ఉంద‌ని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి  తెలిపారు. నిందితుల‌పై క‌ఠిన‌చర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు శ్రీనివాసరావుపై పీడీ చట్టం ప్రయోగిస్తామ‌న్నారు. ప్రజలు సహకరించి అక్రమమద్యంపై సమాచారం ఇవ్వాలని కోరారు. (త్వరలోనే డీఎస్సీ 2020: ఆదిమూలపు సురేశ్‌)

Advertisement
 
Advertisement
Advertisement