
సాక్షి, కర్నూలు: శ్రీశైలం రిజర్వాయర్ వద్ద మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. తేనెటీగల దాడిలో శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ కెనాల్ డివిజనల్ ఇంజనీర్ భానుప్రకాశ్ మృతి చెందారు. కర్నూలు జిల్లా బనకచర్ల రెగ్యులేటర్ వద్ద విధుల్లో ఉండగా ఆయనపై ఒక్కసారిగా తేనెటీగల గుంపు దాడి చేసింది. పెద్ద ఎత్తున తేనెటీగలు దాడి చేయడంతో భానుప్రకాశ్ ప్రాణాలు విడిచారు. ఇదిలాఉండగా.. గత నెలలో శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో 9 మంది ఉద్యోగులు మరణించిన సంగతి తెలిసిందే.
(చదవండి: విషాదం: లోపలున్న 9 మందీ మృతి)