#TirupatiRains : ప్రకృతి ప్రకోపం.. విలవిల్లాడుతున్న తిరుపతి

Heavy Rain In AP Tirupati Flood Videos Trending In Twitter - Sakshi

సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న తిరుపతి వరద వీడియోలు

సాక్షి, తిరుపతి: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో చిత్తూరు జిల్లాలో గత రెండు రోజులుగా అతిభారీ వర్షాలు కురిశాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కుండపోత వర్షంతో చిత్తూరు జిల్లా చిగురుటాకులా వణుకుతోంది. ఎడతెరపి లేని వర్షంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుమలలోని నాలుగు మాడవీధుల్లో పెద్దఎత్తున వరద నీరు చేరుకుంది..  క్యూలైన్లలో కూడా పెద్దఎత్తున వరద నీరు చేరింది. మరోవైపు భారీ వర్షాల కారణంగా.. తిరుపతి చుట్టుపక్కల ప్రాంతంలోని జలపాతాలు మత్తడి దూకుతున్నాయి. 
(చదవండి: తిరుపతి విల విల)

ఇక రోడ్లు, అండర్‌వే బ్రిడ్జీలు జలమయం అయ్యాయి. ఎక్కడికక్కడ వాహనాలు వరద నీటిలో చిక్కుకుపోగా.. కొన్ని చోట్ల వరద ధాటికి తట్టుకోలేక పలు వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందలు ఎదుర్కొన్నారు. ఒకచోట స్వర్ణముఖి నదిలో ఇల్లు కొట్టుకుపోయింది. 
(చదవండి: వరద చుట్టిముట్టినా.. ఒంటి చేత్తో ముగ్గురు గర్భిణీలకు సాయం)

ఇక పలు చోట్ల రోడ్ల మీద, ఇళ్లలో చేరిన వరద నీటిలో జనాలు ఈత కొట్టారు. తిరుపతి వరదలకు సంభందించిన వీడియోలు ప్రస్తుతం ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి. 

చదవండి: వర్షాలపై సీఎం జగన్‌ అత్యవసర సమీక్ష.. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top