చిత్తూరులో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య | Father And Three Children Commit Suicide In Bangareddypalle Chittoor District | Sakshi
Sakshi News home page

చిత్తూరులో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

Jun 22 2026 7:42 AM | Updated on Jun 22 2026 8:40 AM

Father And Three Children Commit Suicide In Bangareddypalle Chittoor District

సాక్షి, చిత్తూరు:  చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుకేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి ఆత్మహత్యకు అనారోగ్య  సమస్యలు, ఆర్థిక పరిస్థితులే కారణమని స్థానికులు చెబుతున్నారు. అయితే, పిల్లలతో సహా అందరూ మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటిపర్యంతమవుతున్నారు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా బంగారెడ్డి పల్లె గ్రామానికి దాము, నిర్మల ఇద్దరూ భార్యభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు, అయితే, నిర్మలకు అనార్యోగ సమస్యలు ఉన్నాయి. దీంతో, ఆర్థిక సమస్యలు ఎక్కువైనట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే భర్త దాము, భార్య నిర్మల ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement