Fact Check: సంస్కరణలు వద్దట.. వెనుకబాటే ముద్దట

False propaganda eenadu on government education reforms - Sakshi

ప్రభుత్వ విద్యా సంస్కరణలపై ఈనాడు తప్పుడు ప్రచారం 

ఉన్నత ప్రమాణాలతో విద్యనందిస్తుంటే తట్టుకోలేని రామోజీ

చంద్రబాబు హయాంలో కుదేలైన ప్రభుత్వ విద్యా వ్యవస్థ

1,785 పాఠశాలలను మూసేసిన బాబు ప్రభుత్వం

పేద పిల్లలూ ఉన్నత స్థాయికి ఎదగాలన్నది సీఎం జగన్‌ ఆకాంక్ష

2021లో సమగ్ర అధ్యయనం తర్వాత ప్రభుత్వ విద్యా రంగంలో సంస్కరణలు అమలు

ఉన్నత స్థాయి ప్రమాణాలతో పాఠశాలల్లో సదుపాయాలు

బాబు మూసేసిన స్కూళ్లనూ తెరిచిన సీఎం జగన్‌

కేవలం 4943 ప్రైమరీ, యూపీ స్కూళ్లు 3557 ప్రీ–హైస్కూల్స్,హైస్కూళ్లతో మ్యాపింగ్‌ 

కిలోమీటరు లోపు దూరం ఉన్న స్కూళ్లే మ్యాపింగ్‌

దీని ద్వారా 3 వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లతో బోధన

విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు

సాక్షి, అమరావతి: విద్యా వ్యవస్థలో మార్పును, సంస్కరణలను స్వాగతించకపోతే వర్తమానంలో యువత రాతి యుగంలోనే ఆగిపోతుందన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ మాటలు కూడా ఎల్లో మీడియాకు ఎక్కవు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం విద్యా రంగంలో తెచ్చిన మార్పులు, సంస్కరణలు ఓవైపు మన పిల్లలను బంగారు భవిత వైపు నడిపిస్తుంటే, రామోజీరావుకు కంటగింపుగా ఉంది.

ఇలాంటి మార్పు, సంస్కరణలు వద్దనే రీతిలో ఈనాడులో తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నారు. పేదింటి పిల్లలు అరకొర చదువులతో నిరుద్యోగులుగా, పెత్తందారుల వద్ద బానిసలుగా బతకాలన్నదే రామోజీ కోరిక. పేదింటి పిల్లలు ఉన్నత స్థాయికి ఎదిగితే తమ బూర్జువా వ్యవస్థ కూలిపోతుందని, చై–నా స్కూళ్ల ప్రాధాన్యం తగ్గిపోతుందన్న భయంతో  ’వినాసకాలే ం.విలీనబుద్ధి’ అంటూ విషం చిమ్మారు. అసలు వాస్తవాలను పరిశీలిస్తే..

బాబు హయాంలో కుప్పకూలిన విద్యా వ్యవస్థ
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా చేపట్టిన చర్యలతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ కుప్పకూలింది. ప్రభుత్వ బడుల్లో కనీస సదుపాయాలూ కల్పించలేక సరిపడినంత మంది విద్యార్థులు లేరన్న సాకుతో 2014–2019 మధ్య 1,785 పాఠశాలలను మూసివేశారు. విద్యా బోధన ప్రమాణాలు దెబ్బ తిన్నాయి. పిల్లలు వయసుకి తగిన అభ్యాస ఫలితాలను సాధించలేకపోయారు.

ఆరో తరగతికి వచ్చే విద్యార్థులు తక్కువ స్టాండర్డ్స్‌తో వస్తున్నారని, బేసిక్స్‌ కూడా తెలియక సిలబస్‌ను అర్ధం చేసుకోలేక­పోతున్నారని ఉపాధ్యా­యుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఎంతసేపూ ప్రైవేటు విద్యా రంగానికి నిచ్చెనలు వేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ప్రభుత్వ విద్యా రంగాన్ని పాతళంలోకి తోసేసింది. దీంతో పేదింటి పిల్లలు చదువులు మానేసే పరిస్థితి ఏర్పడింది.

పేద పిల్లలపై సీఎం జగన్‌ మమకారం
పేద పిల్లలు కూడా కార్పొరేట్‌ స్కూళ్ల విద్యార్థులతో సమానంగా ఎదగాలన్నది సీఎం జగన్‌ ఆకాంక్ష.  దీనికి అనుగుణంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం విద్యా సంస్కరణలపై అధ్యయనం చేసింది. ఎంతోమంది ఉపా« ద్యాయుల సూచనలతో ‘నాడు–నేడు’ పథకంతో సంస్కరణలు చేపట్టింది. చంద్రబాబు హయాంలో మూతపడిన స్కూళ్ల­న్నింటినీ తిరిగి తెరిచింది. 2022–23 విద్యా సంవత్సరంలో కిలోమీటరు లోపు ఉన్న 8,643 ప్రాథమిక, యూపీ పాఠశాలలను గుర్తించింది. వీటీలో కేవలం 4,943 పాఠశా­లలను సమీపంలోని 3,557 ప్రీ–హై స్కూ­ల్స్, హైస్కూళ్లతో మ్యాపింగ్‌ చేసింది.

ఫలితంగా 3 నుంచి 5 తరగతులకు చెందిన 2,43,540 మంది విద్యార్థులకు బీఈడీ అర్హత గల సబ్జెక్టు టీచర్ల ద్వారా విద్యాబోధన అందిస్తున్నారు. దీనివల్ల పిల్లల్లో అభ్యాసన సామర్థ్యాలు బలోపేతమవుతున్నాయి. సబ్జెక్టు టీచర్ల పర్యవేక్షణ ఉండడంతో దీర్ఘకాలంలో 3వ తరగతి నుంచి పిల్లల పనితీరు మెరుగుపడు­తుంది. ఈ సంస్కరణలను ఉన్నత పాఠశా­లల ఉపాధ్యాయులు, ప్రధానోపా­ధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు సైతం స్వాగతించా రు.

మౌలిక సదుపాయాలు, సరిపడినన్ని తర గతి గదులు ఉన్నచోట మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నారు. మ్యాపింగ్‌ కారణంగా ఏ పాఠ శాలనూ మూసివేయలేదు. మ్యాపింగ్‌ చేసిన ఉన్నత పాఠశాలల్లో 66,245 మంది సబ్జెక్టు ఉపాధ్యాయులు 3–10 తరగతుల్లో బోధన చేయాలి. ఇందులో 59,663 మంది ఉపాధ్యా యులు ఇప్పటికే పనిచేస్తున్నారు. పదోన్నతి ద్వారా ఈ విద్యా సంవత్సరంలో 6,582 మంది సబ్జెక్ట్‌ టీచర్లను మ్యాప్‌ చేసిన హైస్కూళ్లకు పంపించారు. నాడు–నేడు ఫేజ్‌–2లో 13,868 అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నారు.

ప్రభుత్వ విద్యలో పూర్వ ప్రాథమిక విద్య ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 1, 2 తర గ తుల బోధన, అభ్యాసంపై దృష్టి కేంద్రీ క రించి, తదుపరి అభ్యాసానికి పునాది వేసింది. పైగా అంగన్వాడీలను పీపీ–1, పీపీ–2 బోధన స్థాయికి పెంచింది. 1, 2 తరగతుల నమోదు ఆధారంగా అన్ని ఫౌండేషన్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించారు. ప్రాథమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్‌ టీవీలు, హైస్కూళ్లల్లో 62 వేల ఐఎఫ్‌ పీ స్క్రీన్లతో డిజిటల్‌ బోధన సాగుతోంది. 

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top