‘పారిశ్రామిక రాయితీల జాడ ఏది?’ అంటూ అసత్య కథనం.. ఇదీ వాస్తవం

Fact Check: Eenadu False News On Industries Department Of AP - Sakshi

ఏ రాష్ట్రంలోని లేని విధంగా సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్‌ దూసుకుపోతుంటే,  రాజకీయ ఉనికి కోల్పోతున్న చంద్రబాబుకు ఏదో రకంగా ఊతం ఇవ్వాలనే ఏకైక లక్ష్యంతో ఈనాడు పత్రిక మరో అసత్య కథనాన్ని వార్చి వడ్డించే ప్రయత్నం చేసింది. గత టీడీపీ ప్రభుత్వం రూ.3409 కోట్ల ప్రోత్సాహక బకాయిలను పారిశ్రామిక యూనిట్లకు చెల్లించకుండా ఎగ్గగొట్టడం మాటను అప్పుడు, ఇప్పుడు పక్కన పెట్టి.. ప్రస్తుత వైఎస్‌ జగన్‌ సర్కారు పారిశ్రామిక రాయితీలు ఇవ్వడం లేదనే తప్పుడు కథనాన్ని ప్రచురించింది ఈనాడు.  ‘పారిశ్రామిక రాయితీల జాడేది?’ అంటూ కొత్త రాగం అందుకుంది. 

వాస్తవానికి ప్రతీ క్యాలెండర్‌ ఇయర్‌ ప్రకారం MSME లకు ఏపీ ప్రభుత్వం ప్రోత్సహకాలు అందిస్తూ వస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2019-20 క్యాలెండర్‌ ఇయర్‌కు రూ. 46 కోట్లను జగన్‌ సర్కార్‌ పారిశ్రామిక తోడ్పాడుకు నిధులు విడుదల చేయగా, 2020-21 క్యాలెండర్‌ ఇయర్‌లో రూ. 993.39 ​కోట్లను విడుదల చేసింది.

సుమారు 8వేల MSMEలకు సహకారం అందించాలనే లక్ష్యంతో భారీ మొత్తంలో నిధులు విడుదల చేసింది.  కోవిడ్‌ మహమ్మారితో దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు చేయూత అందించే దిశగా అడుగులు వేసింది. ప్రతీ ఆగస్టు నెలలో MSMEలకు నిధులు విడుదల చేస్తోంది ఏపీ సర్కారు.  ఏపీ సర్కారు అందించే ఈ తోడ్పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు నడుపుకునే వారికి ఎంతో లాభదాయకంగా మారింది. 

అయితే 2022-23 పారిశ్రామిక రాయితీలను ఆగస్టు నెలలో ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది.  కానీ 2023లో గ్లోబల్‌ ఇన్వెస్టిమెంట్‌ సమ్మిట్‌ ఉన్నందున సదరు ప్రోత్సాహకాలను 2023, ఫిబ్రవరి నెలలో విడుదల చేయడానికి ఏపీ సర్కారు నిర్ణయించింది. ఈలోపు ఏపీలో ఎమ్మెల్సీ కోడ్‌ అమల్లోకి వచ్చింది. దాంతో MSMEల నిధులు ఇవ్వడానికి అంతరాయం ఏర్పడింది. ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే ఈ నిధులు విడుదల చేయడానికి సర్కారు సిద్ధంగా ఉంది. 

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న విషయం తెలిసి కూడా జగన్‌ సర్కారును అప్రతిష్టపాలు చేసి, చంద్రబాబును పైకి లేపాలనే తాపత్రాయంతో ఆర్టికల్‌ను ప్రచురించి మరీ రామోజీరావు తన భక్తిని చాటుకున్నాడు. ఎంతమాత్రం వాస్తవం లేని ఆ వార్తలోని అసలు వాస్తవాన్ని గ్రహించాలని ఏపీ పారిశ్రామిక శాఖ ఒక ప్రెస్‌నోట్‌ను రిలీజ్‌ చేసింది.

MSMEలకు ఇతర సహకారం ఇలా..

1. కరోనా సమయంలో సైతం పారిశ్రామిక రంగానికి దన్నుగా నిలిచింది ఏపీ సర్కారు. 2014-15 క్యాలెండర్‌ ఇయర్‌ నుంచి మంజూరు చేయబడిన అన్ని ప్రోత్సహకాలను  చెల్లించింది జగన్‌ సర్కారు. చంద్రబాబు చెల్లించకుండా వదిలేసిన ప్రోత్సహకాలను జగన్‌ సర్కార్‌ చెల్లించి MSMEలకు అండగా నిలిచింది. 

2. మూడు నెలలపాటు విద్యుత్‌పై ఫిక్స్‌డ్‌ డిమాండ్‌ చార్జీలను రద్దు చేసింది

3. భారీ, మెగా పరిశ్రమలకు మూడు నెలల కాలానికి వడ్డీ కానీ జరిమానా వేయకుండా చర్యలు తీసుకుంది. 

4. అదే సమయంలో అవసరమైన విద్యుత్‌ను పరిశ్రమలకు నిరంతరం అందించి వారికి వెన్నుదన్నుగా నిలిచింది.

5.  ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్స్‌లో భాగంగా సంస్కరణల అమలు విజయవంతంపై గతంలో ఏపీకి 10 శాతం మార్కులు మాత్రం పారిశ్రామిక వేత్తలు ఇస్తే,  ప్రస్తుత ఏపీ పారిశ్రామిక అవగాహన సర్వేకు 100శాతం మార్కులు ఇవ్వబడ్డాయి. 

6. కోవిడ్‌ కారణంగా 2020లో పారిశ్రామిక రంగం తీవ్ర సంక్షోభంలో పడిన సమయంలో ఏపీ 97. 89 శాతం మార్కులతో దేశంలోనే తొలిస్థానంలో నిలిచి సత్తా చాటింది. 

MSMEల ప్రమోషన్ కోసం విధానాలు

2020-23 కాలానికి  పారిశ్రామిక అభివృద్ధి విధానం కింద ఎస్సీ-ఎస్టీ పారిశ్రామిక వేత్తల అభ్యున్నతి కోసం ‘వైఎస్సార్‌ జగనన్న బడుగు వికాసం’ సంక్షేమ పథకంతో  పాటు ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఏపీ సర్కారు ప్రకటించింది. ఈ మేరకు 9,631 ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రూ. 661.58 కోట్లు మంజూరు చేసింది. వీరిలో 2207 మంది ఎస్సీ పారిశ్రామిక వేత్తలకు రూ. 111.08 ‍కోట్లు, 424 మంది ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రూ. 24.31 కోట్లు జమ చేసింది ఏపీ సర్కారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top