‘అది అధికారికం కాకుండా ఎలా ఉంటుంది’ | Employees Are Part Of The Government Botsa Satyanarayana | Sakshi
Sakshi News home page

‘అది అధికారికం కాకుండా ఎలా ఉంటుంది’

Jan 24 2022 5:12 PM | Updated on Jan 24 2022 5:25 PM

Employees Are Part Of The Government Botsa Satyanarayana - Sakshi

సాక్షి, అమరావతి: పీఆర్సీ అంశంపై చర్చించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని గుర్తించబోమని ఉద్యోగ సంఘాలు చెప్పడంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఆ కమిటీని అధికారిక కమిటీ కాదనడం సరైనది కాదన్నారు.

జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీతో చర్చలకు ఆహ్వానం పంపాక అధికారికం కాకుండా ఎలా ఉంటుందని బొత్స ప్రశ్నించారు.  ఉద్యోగులు తమ ప్రభుత్వంలో భాగమని, ఉద్యోగులతో చర్చలకు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నామని బొత్స తెలిపారు. కాగా, జీఏడీ ప్రిన్పిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌ను ఉద్యోగ సంఘాలు కలిసి సమ్మె నోటీసు ఇచ్చాయి. 

ఇక్కడ చదవండి: ‘ఉద్యోగులు ఎప్పుడూ ప్రభుత్వంలో భాగమే’

పీఆర్సీపై పిటిషన్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు

Advertisement
 
Advertisement
Advertisement