
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేద పిల్లలు కూడా ఉన్నత స్థితిలోకి రావాలని, చదువుల కోసం ఆస్తులు అమ్ముకునే పరిస్థితులు ఉండకూడదని సీఎం వైఎస్ జగన్ విద్యా రంగంలో అనేక సంస్కరణలు తెచ్చారు. ‘మన బడి నాడు – నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్లను నూతన భవనాలు, అత్యాధునిక సౌకర్యాలతో కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా తీర్చి దిద్దుతున్నారు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం అందిస్తున్నారు. పేద విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిని
అందుకొనేలా ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ బోధన అందిస్తున్నారు. చంద్రబాబు జమానాలో పాఠశాలల పైకప్పులు కూలిపోయినా, బెంచీలు, నీరు లేకపోయినా, టెక్ట్స్‌బుక్స్ ఇవ్వకపోయినా కదలని ‘ఈనాడు’ కలం.. అవే పాఠశాలల్ని అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్న వైఎస్ జగన్ ప్రభుత్వంపై విషం కక్కుతోంది. రెండో దశలో నిర్మాణంలో ఉన్న నాలుగు బడుల ఫొటోలు తీసి ఏమీ జరగడంలేదంటూ కుటిల కథనం ప్రచురించింది.
అసలు వాస్తవాలివీ..
♦ మనబడి నాడు నేడు రెండో దశలో ప్రభుత్వం రూ.8,000 కోట్లతో 22,344 పాఠశాలల్లో పనులు చేపట్టింది. 8,529 పాఠశాలల్లో 25,154 అదనపు తరగతి గదులు కూడా నిర్మిస్తోంది. వచ్చే ఏడాది జనవరి నెలాఖరుకు పూర్తి చేసేలా పనులు చేస్తున్నారు.
♦ ఏలూరు ఆరో డివిజన్‌లోని నగరపాలకోన్నత పాఠశాలలో రెండో దశలో రూ.1.08 కోట్లతో 9 అదనపు తరగతి గదుల నిర్మాణం జరుగుతోంది. ఇప్పటివరకు రూ.62 లక్షల విలువైన పనులు పూర్తి చేశారు.
♦ కర్నూలు జిల్లా కోసిగి జేబీఎం ప్రాథమిక పాఠశాలలో రూ.21.10 లక్షలతో పనులు చేపట్టారు. ఇప్పటివరకు రూ.14.98 లక్షల విలువైన పనులు పూర్తి చేశారు.
♦ విజయవాడ కృష్ణలంక బాలికల పాఠశాలలో రూ.62.87 లక్షలతో పనులు చేపట్టారు. ఇందులో రూ.19.06 లక్షల విలువైన పనులు పూర్తి చేశారు. ఇదే పాఠశాలలో రూ.58.90 లక్షలతో ఐదు అదనపు తరగతి గదుల నిర్మాణం కూడా చేపట్టి, రూ.29.73 లక్షల విలువైన పనులు చేశారు. కృష్ణలంకలోనే ఉన్న ఎస్వీఆర్ ఎంసీహెచ్‌లో రూ.62.94 లక్షలతో పనులు చేపట్టి, రూ.27.55 లక్షల విలువైన పనులు పూర్తి చేశారు. ఏపీఎస్సార్ మున్సిపల్ హైస్కూల్లో రూ.81.18 లక్షలతో పనులు చేపట్టి రూ.33.13 లక్షల విలువైన పనులు చేశారు. రూ.47.79 లక్షలతో 4 అదనపు తరగతి గదులను కూడా నిర్మిస్తున్నారు.
♦తిరుపతి జిల్లాలోని ఎంజీఎం మున్సిపల్ హైస్కూల్లో రూ.84 లక్షలతో ఏడు అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టారు. రూ.19.63 లక్షల పనులు పూర్తి చేశారు.
♦ విశాఖ జిల్లా గంభీరం ఎంపీపీ పాఠశాలలో రూ.17.82 లక్షలతో చేపట్టిన పనుల్లో రూ.10.81లక్షల విలువైన పనులు పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment