సాక్షి ప్రతినిధి, విజయవాడ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్రపతి ముర్ము 14వ తేదీ రాత్రి 7.30 గంటలకు ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు. సుమారు 20 నిమిషాలు దుర్గగుడిలో గడుపుతారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో 14న అమ్మవారికి జరిగే వైదిక కార్యక్రమాలకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దేవస్థాన వైదిక కమిటీ సమావేశమై చర్చించింది.


