1,458 ‘సీనియర్‌ రెసిడెంట్‌’ల నియామకానికి నోటిఫికేషన్‌ 

DME Green Signal For Senior Resident Posts - Sakshi

10 వరకు దరఖాస్తులకు గడువు 

సాక్షి, అమరావతి: ప్రభుత్వ మెడికల్, డెంటల్‌ బోధనాస్పత్రుల్లో 1,458 సీనియర్‌ రెసిడెంట్‌(ఎస్‌ఆర్‌) డాక్టర్‌ల నియామకానికి డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ) నోటిఫికేషన్‌ ఇచ్చింది. గత నెలలోనే ఎస్‌ఆర్‌ల నియామకానికి డీఎంఈ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే ఆ నోటిఫికేషన్‌లో కేవలం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ చదివిన వారికి అవకాశం కల్పించారు. ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసి ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో చదివిన వారికీ అవకాశం కల్పిస్తూ మరో నోటిఫికేషన్‌ ఇచ్చారు. శనివారం నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు.

ఈ నెల 10వ తేదీ రాత్రి 12 గంటల వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వీలుంది. 45 ఏళ్ల లోపు వయసుండి, ఏపీ స్థానికత కలిగి ఉండి పీజీ/డెంటల్‌ డిగ్రీ చదివి ఏపీ మెడికల్‌/డెంటల్‌ కౌన్సిల్‌లో రిజిస్ట్రార్‌ వైద్యులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.  జ్టి్టp://ఛీఝ్ఛ.్చp.nజీఛి.జీn ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు ఎస్‌ఆర్‌లుగా సేవలు అందించాల్సి ఉంటుంది.

సూపర్‌ స్పెషాలిటీ సీనియర్‌ రెసిడెంట్‌కు రూ.85 వేలు, స్పెషాల్టీ సీనియర్‌ రెసిడెంట్‌కు రూ.70 వేలు, సీనియర్‌ రెసిడెంట్‌(పీజీ)కు రూ.65 వేల చొప్పున గౌరవ వేతనం ఉంటుంది. పీజీ తుది పరీక్షల్లో వచ్చిన(థియరీ, ప్రాక్టికల్స్‌)మార్కుల్లో మెరిట్‌ ప్రామాణికంగా, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం ఎంపికలు చేపడతారు. అత్యధికంగా ఎమర్జెన్సీ మెడిసిన్‌లో 144, జనరల్‌ మెడిసిన్‌లో 101, జనరల్‌ సర్జరీ విభాగంలో 101 ఖాళీలున్నాయి. పాథాలజీలో 88, అనాటమీలో 85, ఫార్మకాలజీలో 80, గైనకాలజీలో 69, అనస్థీషియాలో 56, పీడియాట్రిక్స్‌లో 56, ఆప్తమాలజీలో 56 ఖాళీలున్నాయి. ఇలా మొత్తంగా 49 విభాగాల్లో 1,458 ఎస్‌ఆర్‌ పోస్టులు భర్తీ కానున్నాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top