
‘సాక్షి’ కథనంతో హాట్‌టాపిక్‌గా మారిన దేవినేని–కరాటం ఆడియో సంభాషణ
టీడీపీ కుట్రతోనే ఆడియో లీక్ అంటూ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఫైర్
ఉద్దేశపూర్వకంగానే దానిని లీక్ చేశారని జనసేన శ్రేణుల మండిపాటు
ఎమ్మెల్యే నిజాయితీని నిరూపించుకోవాలి : తెల్లం బాలరాజు
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి : సీపీఎం
సాక్షి ప్రతినిధి, ఏలూరు/బుట్టాయగూడెం: తనపై జరిగిన ఆడియో సంభాషణ టీడీపీ కుట్రతోనే లీక్ అయిందని పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.. అవినీతి లేకపోతే సంభాషణే జరిగేది కాదని టీడీపీ నేతలు.. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మీద వచ్చిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ నిర్వహించాలని వామపక్షాలు.. సచీ్ఛలత నిరూపించుకోవాలంటే ఎమ్మెల్యేనే దర్యాప్తు సంస్థతో విచారణ చేయించుకోవాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్.. ఇదీ పోలవరం ఎమ్మెల్యే అవినీతి వ్యవహారంపై సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారిన ఆడియోపై స్పందనలు. ఎమ్మెల్యే ఏడాదిలోనే రూ.వంద కోట్లు సంపాదించాడని టీడీపీ కూటమి పార్టీలోని కీలక నేతలే మాట్లాడిన ఆడియో అటు జనసేన పార్టీతో పాటు జిల్లాలోనూ తీవ్ర కలకలం రేపింది.
అన్ని పార్టీల్లోనూ ఇదే హాట్‌టాపిక్..
పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఏడాదిలో రూ.వంద కోట్లు సంపాదించాడని, ఆయన ఘనతను యూట్యూబ్‌లో చూశానంటూ టీడీపీ నేత, మాజీమంత్రి దేవినేని ఉమ.. జనసేన ముఖ్యనేత, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు మధ్య జరిగిన ఫోన్ సంభాషణల ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పైగా.. ఇందుకు సంబంధించిన కథనం శనివారం ‘సాక్షి’లో ప్రముఖంగా రావడంతో పోలవరం నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీల్లో ఇదే హాట్‌టాపిక్‌గా మారింది. చిర్రి బాలరాజు వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదంగా ఉండటంతో పాటు ఆయనపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి.
మద్యం సిండికేట్, బెల్టుషాపులు, ఉద్యోగుల బదిలీలు, ఇసుక అక్రమాలు, ఆర్ అండ్ ఆర్‌లో అవినీతి.. ఇలా ప్రతి అంశంలో ఎమ్మెల్యే పాత్ర ఉందంటూ టీడీపీ, జనసేన కేడరే తరుచూ సోషల్ మీడియా వేదికగా పరస్పర ఆరోపణలు గుప్పించుకోవడంతో నిత్యం నియోజకవర్గ రాజకీయం హాట్ హాట్‌గా మారింది. ఈ నేపథ్యంలో.. సదరు ఎమ్మెల్యే గత ఏడాది కాలంలో రూ.వంద కోట్లు సంపాదించాడన్న ఒక వీడియోను ప్రస్తావిస్తూ టీడీపీ నేత దేవినేని ఉమ అదే నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ఫోన్ నుండి కరాటం రాంబాబుకు ఫోన్‌చేసి మాట్లాడారు. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఎలా బయటకు వచి్చందనే దానిపైనే తీవ్రంగా చర్చ జరుగుతోంది.
ఎమ్మెల్యే విచారణ జరిపించుకోవాలి: తెల్లం బాలరాజు
మరోవైపు.. రూ.వంద కోట్ల అవినీతి దేశంలోనే రోల్ మోడల్ వ్యవహారమంటూ సాగిన ఆ ఫోన్ సంభాషణ రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు దీనిపై తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యే తన నిజాయితీని నిరూపించుకోవాలంటే ఏదైనా దర్యాప్తు సంస్థతో విచారణ చేయించుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని పోలవరం నియోజకవర్గానికి మంచి పేరుందని, చిర్రి బాలరాజు దాన్ని పాడుచేస్తున్నారని మండిపడ్డారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి : సీపీఎం
ఎమ్మెల్యే మీద వచ్చిన ఆరో పణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ. రవి డిమాండ్ చేశారు. గతంలో ఇసుక, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, వైన్‌షాపుల విషయంలో ఎమ్మెల్యేపై ఆరోపణలు వచ్చాయని.. వీటిపై వార్తలు రాసిన అనేకమంది విలేకరులపై కేసులు పెట్టారని.. వీటన్నింటిపైన సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కోరారు.
నేను అవినీతికి పాల్పడలేదు: ఎమ్మెల్యే చిర్రి బాలరాజు
తనపై సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలపై ఏలూరు జిల్లా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పందించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గిరిజనుడైన తాను ఎన్నడూ అవినీతికి పాల్పడలేదని, పాల్పడబోనన్నారు. తన నుంచి ఆరి్థక లబ్ధిని ఆశించి, అందుకు నిరాకరించడంతో సోషల్ మీడియాలో అసత్య ప్రచారానికి పాల్పడ్డారని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలపై ఇద్దరు నాయకులు మాట్లాడుకున్న మాటలను రికార్డు చేసి రూ.100 కోట్లు ఆర్జించానంటూ ప్రచారం చేసిన మీడియా సంస్థలపై, నాయకులపై న్యాయస్థానంలో కేసులు వేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. దీనిపై ఓ నివేదికను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు కూడా సమరి్పస్తానన్నారు. రూ.100 కోట్ల సంపాదన ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు.