
మాజీ సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి:మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మృతి పట్ల మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. ‘మా కుటుంబానికి సన్నిహితులైన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మృతి బాధాకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని.. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’అంటూ వైఎస్ జగన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు.