ఏపీలో కొత్తగా 3,892 కరోనా కేసులు | Coronavirus: 3892 New Positive Cases Registered In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో రికార్డ్‌స్థాయిలో కరోనా పరీక్షలు

Oct 14 2020 6:54 PM | Updated on Oct 14 2020 8:19 PM

Coronavirus: 3892 New Positive Cases Registered In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 69,463 నమూనాలు పరీక్షించగా 3,892పాజిటివ్‌  కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,67,465కు చేరింది. కొత్తగా 28 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 6,319కి చేరింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 5,050 మంది కోవిడ్‌ను జయించి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు 67,72,273 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 41,669 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.
(చదవండి : భారత్‌లో 72 లక్షలు దాటిన కరోనా కేసులు)

Advertisement
 
Advertisement
Advertisement