ఏపీలో కొత్తగా 9,901 పాజిటివ్‌ కేసులు | Corona Update 9901 Positive Cases Reported In AP | Sakshi
Sakshi News home page

Sep 12 2020 6:14 PM | Updated on Sep 12 2020 6:33 PM

Corona Update 9901 Positive Cases Reported In AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ విజృంభణ కొనసాగుతోంది. శనివారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 45,27,593 టెస్టులు పూర్తయ్యాయి. గడిచిన 24 గంటల్లో 75,465 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీరిలో 9,901 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,57,587 కు చేరింది. కొత్తగా 67మంది మరణించగా మొత్తం మరణాల సంఖ్య 4,846కి చేరింది. శనివారం నాడు 10,292 మంది కరోనా నుంచి కోలుకోని డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శనివారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇప్పటి వరకు ఏపీలో 4,57,008 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 95,733 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. (చదవండి: తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement