యాజమాన్యానికి వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల అల్టిమేటం జారీ | Contract Employees Ultimatum To Vizag Steel Plant Management | Sakshi
Sakshi News home page

యాజమాన్యానికి వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల అల్టిమేటం జారీ

Published Wed, Mar 26 2025 8:09 PM | Last Updated on Wed, Mar 26 2025 8:30 PM

Contract Employees Ultimatum To Vizag Steel Plant Management

సాక్షి, విశాఖ: స్టిల్‌ ప్లాంట్‌ యజమాన్యానికి కాంట్రాక్ట్ కార్మికులు అల్టిమేటం జారీ చేశారు. కార్మికులను విధుల్లోకి తీసుకోకపోతే సమ్మె చేస్తామని హెచ్చరించారు.  మార్చి 28 ఉదయం నుంచి ఒక రోజు హెచ్చరిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఇవాళ ఆర్ఎల్సితో చర్చలకు కాంట్రాక్ట్ కార్మిక నేతలు హాజరయ్యారు. ఈ తరుణంలో చర్చలు సఫలమైతే  నిరవధిక సమ్మె చేస్తామని స్పష్టం చేశారు.

మరోవైపు, విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్‌ కార్మికుల తొలగింపుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు ఇటీవల పాదయాత్రకు పిలుపునిచ్చారు. తొలగించిన ఉ‍ద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కొత్త గాజువాక జంక్షన్‌ నుంచి కూర్మన్నపాలెం స్టీల్‌ప్లాంట్‌ ఆర్చ్‌ వరకు నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా  ఉక్కు పోరాట కమిటీ చైర్మన్ నరసింగరావు మాట్లాడుతూ..‘కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ప్రైవేటీకరణలో భాగం. కార్మికులు లేకుండా ప్లాంట్‌ను ఎలా నడుపుతారు. ఒక్క కార్మికుడిని కూడా తొలగించకుండా పోరాడుతాం. స్థానిక ప్రజా ప్రతినిధులకు ప్లాంట్ కార్మికులతో అవసరం తీరిపోయింది. ఇంత మందిని తొలగిస్తుంటే పల్లా శ్రీనివాస్ ఎందుకు మాట్లాడటం లేదు?. స్థానిక ప్రజా ప్రతినిధులు నిద్రపోతున్నారు. పోరాటంతోనే కార్మికుల హక్కులను సాధిస్తాం’ అని వ్యాఖ్యలు చేశారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement