CM YS Jagan's Special Focus On The Development Of Vizag City - Sakshi
Sakshi News home page

వైజాగ్‌.. ఓ బ్రాండ్‌ సిటీ.. సక్సెస్‌ మంత్రంగా బీచ్‌ ఐటీ కాన్సెప్ట్‌

Mar 6 2023 4:08 AM | Updated on Mar 6 2023 3:12 PM

CM YS Jagan's special focus on the development of Vizag city - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలో ఓవైపు కడలి కెరటాలు.. మరోవైపు పెట్టుబడులు పోటెత్తాయి. బెస్త గ్రామం నుంచి మహానగరంగా మారిన విశాఖ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ (జీఐఎస్‌). పరిపాలన రాజ­ధానిగా కాబోతున్న నేపథ్యంలో వైజాగ్‌.. ఓ బ్రాండ్‌ సిటీ అయింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌­రెడ్డి ఆ నగరానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారు. సదస్సు విజయవంతం అయిన తర్వాత ‘దేశానికి ఆర్థికకోట విశాఖ..’ అని అందరి నోటా ఒకే మాట.

జీఐఎస్‌–2023తో పెట్టుబడుల స్వర్గధామంగా సరి­కొత్త ఇమేజ్‌కు నాంది పలికిన వైజాగ్‌.. ఇదే స్ఫూర్తితో జీ–20 సదస్సుకు సిద్ధమవుతోంది. రాజదాను­లెన్నింటికో రాదారిగా ఉన్న విశాఖ­పట్నాన్ని పరిపాలన రాజధానిగా మార్చాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పం సిద్ధిం­చే దిశగా వడివడిగా అడుగులు పడుతు­న్నా­యి. చోదకశక్తి కేంద్రాలుగా మారు­తున్న ద్వితీయ, తృతీయశ్రేణి నగ­రాల జాబితాలో అగ్ర­భాగంలో ఉన్న విశాఖపట్నంలో రెండురోజులు నిర్వ­హించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ సూపర్‌ సక్సెస్‌ అయింది.

ప్రణాళికాబద్ధంగా నిర్మిత­మైన నగ­రంగా విశాఖకు ఈ సమ్మిట్‌ నిర్వహణతో అంత­ర్జాతీయ గుర్తింపు దక్కింది. గత ప్రభుత్వ హయా­ంలో మూ­డు­మార్లు పెట్టుబడుల సదస్సులు నిర్వ­హి­ం­చినా రా­ని ఇమే­జ్‌.. వైఎస్సార్‌­­సీపీ ప్రభు­త్వం మొద­టి­సారి ఏర్పాటు చేసిన జీఐఎస్‌తో వైజాగ్‌ పేరు ఖండాంతరాలు దాటింది. సీఎం వైఎస్‌ జగన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నిర్వహించిన సమ్మి­ట్‌కు దేశవిదే­శాలకు చెందిన దిగ్గజ పారిశ్రామిక­వేత్తలు, ప్రతి­నిధులు హాజరై విశాఖ నగర వైభవా­నికి వావ్‌ అన్నారు. 

కొత్త ఇమేజ్‌ తీసుకొచ్చారు
ఇన్నాళ్లు.. విశాఖపట్నం అంటే అలల సవ్వ­డు­లతో.. అందాల నగరంగా.. పర్యాటక ప్రాంతంగా మాత్రమే గుర్తింపు ఉండేది. కానీ.. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ నిర్వహించిన తర్వాత నగరానికి సరి­కొత్త ఇమేజ్‌ వచ్చింది. ఎవరు వచ్చినా ఆహ్వా­నిం­చదగ్గ ఆహ్లా­ద­­­కర­మైన వాతా­వర­ణం ఉన్న విశాఖ నగ­రంలో తమ వ్యా­పార కార్య­కలా­­పాలు విస్త­రించాలన్న ఆలో­­చ­నల్ని పారి­శ్రా­మిక­వే­త్తలు స్వ­య­ంగా చూసిన తర్వాత మరింత బల­పరు­చు­కు­న్నారు.

నివాస­యోగ నగ­రాల్లో టైర్‌–­1 సిటీలతో పోటీ­పడు­తున్న విశాఖ­పట్నం పెట్టుబ­డులకు కూడా ప్రధాన కేంద్రంగా మారింది. హైద­­­రా­బాద్‌ని మించి అభివృద్ధి చేసే అవ­కా­శా­లు­న్న­ప్పటికీ.. గత పాలకులు విశాఖని ఒక నగరంగానే గుర్తించి విస్మ­రించడంతో అను­కున్న మేర అభివృద్ధి చెందలేదు. కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప­ట్టిన తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌­రెడ్డి విశాఖపై ప్రత్యేక శ్రద్ధ వహించారు.

నగరానికి కొత్త ఇమేజ్‌ తీసు­కొచ్చేందు­కు ఆలో­చనలు కార్యరూపం దాల్చే­లా అడుగులు వేశారు. అనుకున్నట్లుగానే పెట్టు­బడుల సదస్సుతో ‘తింటే గారెలే తినాలి.. వింటే భారతం వినాలి.. ఉంటే వైజాగ్‌లోనే ఉండాలి.. చేస్తే విశాఖ­లోనే వ్యా­పా­రం చేయాలి..’ అనే స్థాయికి తీసుకెళ్లారు.

బహుళ ప్రాజెక్టులతో ఆకర్షణ మంత్రం
సువిశాల సాగరతీరం చెంతనే ఆహ్లాదకరమైన వాతా­వరణంలో ఐటీ పరిశ్రమల్ని అభివృద్ధి చేసి సిటీ ఆఫ్‌ డెస్టినీని ఐటీ హబ్‌గా మార్చాలనే ఉద్దేశంతో బీచ్‌ ఐటీ కాన్సెప్ట్‌ని తొలుత ప్రమోట్‌ చేయాలని భావించారు. ఇందులో భాగంగానే ఇన్ఫోసిస్, టెక్‌ మహీంద్ర, హెచ్‌సీఎల్, యాక్సెంచర్, రాండ్‌స్టాడ్, డబ్ల్యూఎన్‌ఎస్, అమెజాన్‌ తదితర ఐటీ, ఐటీ అనుబంధ దిగ్గజ సంస్థలన్నీ విశాఖవైపు అడుగులు వేశాయి. తాజాగా విప్రో కూడా తన సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు విశాఖనే ఎంపిక చేసుకుంది.

ఇలా ఐటీ డెస్టినీగా మారుతున్న విశాఖలో ఇతర పరిశ్రమలకూ ఆస్కారం ఉందన్న ఆలోచన దిగ్గజ పారి­శ్రామికవేత్తల మదిలో కలిగేలా సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖని విశ్వవ్యాప్తంగా ప్రమోట్‌ చేశారు. అందుకే అదానీ డేటా సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అదేవిధంగా వైజాగ్‌ టెక్‌పార్క్‌ కూడా డేటాసెంటర్‌తో పాటు బిజినెస్‌ పార్క్, స్కిల్‌ యూనివర్సిటీలను రూ.21,844 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసి 39,815 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముందుకొచ్చింది.

గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఎన్టీపీసీ, ఇంధన రంగంలో హెచ్‌పీసీఎల్, పర్యాటక రంగంలో ఒబెరాయ్, తాజ్, టర్బో ఏవియేç­Ùన్‌.. ఇలా విభిన్న రంగాల్లో బహుళ ప్రాజెక్టుల్ని విశాఖ జిల్లాలోనే ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు మొగ్గుచూపడానికి కారణం వైజాగ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిన సీఎం వైఎస్‌ జగన్‌ అన్నది జగ­మెరిగిన సత్యం. జీఐఎస్‌ ద్వారా ఉమ్మడి విశాఖ జిల్లాకు దాదాపు రూ.లక్షన్నర కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

మరో అంతర్జాతీయ సదస్సుకు ముస్తాబు
భిన్న వాతావరణం, విభిన్న సంస్కృతులు, మెచ్చే భాషలు, ఆది నుంచి దూసుకుపోతున్న రియల్‌ రంగం, అందుబాటులో మౌలిక వసతులు వెరసి..  దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు విశాఖపట్నం వైపు చూస్తు­న్నారు. జీఐఎస్‌ విజయవంతం కావడంతో అంతర్జాతీయ ప్రముఖులకు సైతం వైజాగ్‌ అంటే ఇష్టం పెరిగింది. మళ్లీమళ్లీ నగరానికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు కూడా వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే షెడ్యూల్‌ ఖరారైన జీ–20 సదస్సుకు నగరం ముస్తాబవుతోంది. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ స్ఫూర్తితో జీ–20 సదస్సుని విజయవంతం చేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోంది. మరోవైపు త్వరలో విశాఖ నుంచి పాలన కొనసాగిస్తానని సీఎం వైఎస్‌ జగన్‌ పునరుద్ఘాటించడంతో ప్రజల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించే జీ–20 సదస్సును విజయవంతం చేయడంలో తాము కూడా భాగస్వాములవుతామని నగరవాసులు చెప్పకనే చెబుతుండటం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement