గాంధీ జయంతి నాడు గిరిజనులకు నజరానా 

CM YS Jagan tweeted on the occasion of Tribal Day - Sakshi

ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీ 

ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ 

సాక్షి, అమరావతి: అక్టోబర్‌ రెండో తేదీ గాంధీ జయంతి నాడు గిరిజన ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ట్వీట్‌ చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా చేసిన ఈ ట్వీట్‌లో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ‘దేశీయంగా ఉన్న విభిన్న జాతులకు ఆంధ్రప్రదేశ్‌ నిలయం. మా గిరిజన వారసత్వం గురించి మేము గర్విస్తున్నాము.

వారి సంస్కృతి, గిరిజన జాతిని ఉద్ధరించడానికి, సంరక్షించడానికి మా శక్తి సామర్థ్యం మేరకు అన్నీ చేస్తున్నాము. కోవిడ్‌–19 వల్ల గిరిజనులకు పంపిణీ చేయాల్సిన ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీ అక్టోబర్‌ 2కి వాయిదా వేశాము. అదే రోజు కురుపాంలో ఇంజనీరింగ్‌ కాలేజీ, పాడేరులో మెడికల్‌ కాలేజీ, గిరిజన విశ్వవిద్యాలయాలకు శంకుస్థాపన చేయనున్నాము. అదే రోజు ఏడు ఐటీడీఏల పరిధిలో ఏడు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నాము.’’  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top