కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష | CM YS Jagan Review Meeting On Coronavirus In Tadepalli | Sakshi
Sakshi News home page

కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష

Jun 18 2021 11:41 AM | Updated on Jun 18 2021 3:06 PM

CM YS Jagan Review Meeting On Coronavirus In Tadepalli - Sakshi

సాక్షి, తాడేపల్లి: కోవిడ్‌ నివారణ చర్యలపై  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం చేపట్టారు. 350 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్‌ను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. మెడికల్ ఆక్సిజన్‌ విషయంలో రాష్ట్రానికి స్వయం సమృద్ధి వస్తుందన్నారు. ఈ సమీక్షకు మంత్రి ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌ సహా ఇతర అధికారులు హాజరయ్యారు. కోవిడ్ వ్యాక్సినేషన్‌ వేగవంతంపై అధికారులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు. కేసుల తగ్గుదల, కర్ఫ్యూ కొనసాగింపు, సడలింపులపై సమావేశంలో చర్చించారు.

Advertisement
 
Advertisement
Advertisement