వరుస దాడులపై సీఎం జగన్‌ ఆగ్రహం.. తక్షణమే విచారణకు ఆదేశం | CM YS Jagan Mohan Reddy Immediate Orders To Molestation Incidents | Sakshi
Sakshi News home page

వరుస దాడులపై సీఎం జగన్‌ ఆగ్రహం.. తక్షణమే విచారణకు ఆదేశం

Sep 15 2021 2:57 PM | Updated on Sep 15 2021 6:02 PM

CM YS Jagan Mohan Reddy Immediate Orders To Molestation Incidents - Sakshi

సాక్షి, అమరావతి: నెల్లూరు యువతిపై అమానుష దాడి, విశాఖలో తొమ్మిదేళ్ల బాలికలపై జరిగిన ఘటనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఘటనలపై వెంటనే స్పందించిన సీఎం జగన్‌ వెంటనే కఠిన చర్యలకు ఆదేశించారని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఈ దారుణాలకు పాల్పడిన నిందితులను తక్షణం అదుపులోకి తీసుకోవాలని సీఎం ఆదేశించారని చెప్పారు. ఈ రెండు ఘటనల్లో బాధితుల పరిస్థితిని చైర్‌పర్సన్‌ స్వయంగా వాకబు చేశారు. పోలీస్ అధికారులతో మాట్లాడి దర్యాప్తు వివరాలను తెలుసుకోడమే కాక కమిషన్ సభ్యుల బృందాన్ని ఘటనా స్థలానికి పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement