AP Cabinet Meet: నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఉదయం 11.30 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారని అధికార వర్గాల సమాచారం. సమావేశంలో ఎలక్ట్రానిక్ పాలసీతో పాటు ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్‌ఈ సిలబస్ అమలుకు అవగాహన ఒప్పందం చేసుకోవడంపైన, రాష్ట్రంలో కోవిడ్–19 నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై తీసుకుంటున్న చర్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.