
సాక్షి, అమరావతి: చేనేత కార్మికులను చూస్తే గర్వంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. ‘దేశీయ వస్త్ర పరిశ్రమలో చేనేత కార్మికుల పరంగా రాష్ట్రం రెండవ స్థానంలో ఉంది. రాష్ట్రంలోని గొప్ప వస్త్ర వారసత్వాన్ని కాపాడటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్న మా నేతన్నలను చూస్తే గర్వంగా ఉంది’ అని ట్వీట్‌లో కొనియాడారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా అర్హత కలిగిన చేనేత కుటుంబాలకు రూ. 24,000 చొప్పున వరుసగా రెండేళ్లు ఇవ్వడం.. ముఖ్యంగా కోవిడ్–19 వంటి సమయంలో చేనేత కార్మికుల జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేసిందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.