అసెంబ్లీ బీఏసీ సభ్యులను నియమించిన సీఎం జగన్‌

CM YS Jagan Appointed Members Of Assembly BAC - Sakshi

సాక్షి, అమరావతి: అసెంబ్లీ బీఏసీ సభ్యులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. మంత్రి వర్గ మార్పుల నేపథ్యంలో బీఏసీ సభ్యులను సీఎం మార్చారు. కన్నబాబు, అనిల్‌కుమార్‌ స్థానంలో బీఏసీ సభ్యులుగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్‌, బీఏసీలో లేజిస్లేటివ్‌ అఫైర్‌ కో ఆర్డినేటర్‌గా గండికోట శ్రీకాంత్‌రెడ్డిలను నియమించారు.
చదవండి: ఏపీలో మరో భారీ సంక్షేమ పథకం.. అక్టోబర్‌ 1 నుంచి అమలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. 15వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకుంటుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top