జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై సీఎం జగన్ సమీక్ష | CM Jagan Review on Jagananna Saswatha Bhu Hakku Bhu Raksha Scheme | Sakshi
Sakshi News home page

జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై సీఎం జగన్ సమీక్ష

Published Mon, Dec 26 2022 1:07 PM | Last Updated on Mon, Dec 26 2022 4:09 PM

CM Jagan Review on Jagananna Saswatha Bhu Hakku Bhu Raksha Scheme - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూ రక్ష (భూముల సమగ్ర రీసర్వే)పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర భూ సర్వే కోసం ఉపయోగిస్తున్న డ్రోన్లు, సర్వే రాళ్లను సీఎం పరిశీలించారు. డ్రోన్ల పనితీరును అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. 

సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షకు ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయడు, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి,  ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి సాయి ప్రసాద్‌, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధిక శాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, సర్వే సెటిల్మెంట్స్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌ సిద్దార్థ జైన్, పంచాయతీరాజ్ శాఖ‌ కమిషనర్‌ కోన శశిధర్, సీసీఎల్‌ఏ కార్యదర్శి ఏ ఎండి ఇంతియాజ్,  మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్, మైనింగ్‌ శాఖ డైరెక్టర్‌ వీ జీ వెంకటరెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

చదవండి: (వంగవీటి రంగా హత్య కేసులో ముద్దాయిలు ఆ ఇద్దరే: కొడాలి నాని)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement