వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్లతో సీఎం జగన్‌ భేటీ | Cm Jagan Meeting With Ysrcp Regional Coordinators | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్లతో సీఎం జగన్‌ భేటీ

Apr 4 2023 6:12 PM | Updated on Apr 5 2023 7:45 AM

Cm Jagan Meeting With Ysrcp Regional Coordinators - Sakshi

వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు.

అమరావతి: ముఖ్యమంత్రి, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌.జగన్‌ పార్టీకి చెందిన ప్రాంతీయన సమన్వయకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే….

► ఎన్నికలకు సంవత్సరం మాత్రమే సమయం ఉంది. 
► పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లుగా మీరు ఓనర్‌షిప్‌ తీసుకోవాలి.
► మీకు అప్పగించిన వివిధ జిల్లాల్లో పార్టీనేతలను బలోపేతం చేయాల్సిన బాధ్యత మీదే. 
► ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే.. వాటిని సరిదిద్ది అందర్నీ ఒక్కతాటిపైకి తీసుకురావాలి.
► అంతిమంగా మన అభ్యర్థులకు మంచి మెజార్టీలు రావాలి. 
► ఆ లక్ష్యంతోనే మీరు సంకల్పంతో పనిచేయాలి.
► పార్టీ సమన్వయ కర్తలుగా మీరు నాతో ఏ విషయాన్నైనా చర్చించండి. 
► ఎప్పుడైనా నన్ను కలవవచ్చు. పార్టీ పరంగా మీరు నాకు టాప్‌ టీం. 
► సచివాలయ కన్వీనర్ల రూపంలో, గృహసారథుల రూపంలో కింద చక్కటి యంత్రాంగం ఉంది. వాలంటీర్లను వారితో మమేకం చేయాలి.
► ఈ యంత్రాంగాన్ని చురుగ్గా పనిచేయించడానికి, క్రియాశీలకంగా ఉండడానికి కార్యక్రమాలను నిర్దేశించాం. 
► ఆ కార్యక్రమాలన్నీ సజావుగా, సమర్థవంగా ఆయా నియోజకవర్గాల్లో నడిచేలా మీరు పర్యవేక్షణ, సమన్వయ బాధ్యతలు స్వీకరించండి. 
► మీరు, నేను, పార్టీ యంత్రాంగం అంతా కలిసి ముందుకుసాగాలి.


ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,బాలినేని శ్రీనివాస రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, భూమన కరుణాకర్ రెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మర్రి రాజశేఖర్, రామసుబ్బారెడ్డి, మిధున్ రెడ్డి, ఆకేపాటి అమర్నాథరెడ్డి, బీద మస్తాన్ రావు తదితరులు హాజరైయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement