
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నంలో పర్యటించారు. నగరంలోని పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలి వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరయ్యారు. పీఎంపాలెం వైజాగ్ కన్వెన్షన్‌లో జరుగుతున్న నిహారిక, రవితేజ వివాహ రిసెప్షన్‌కు హాజరై వధూవరుల్ని ఆశీర్వదించారు. సీఎం వైఎస్ జగన్ రాకతో పెళ్లి వేడుకలో సందడి నెలకొంది.
విజయనగరం డీసీసీబీ చైర్మన్ కుమార్తె వివాహానికి హాజరైన సీఎం జగన్
విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ హాల్‌లో జరుగుతున్న విజయనగరం డీసీసీబీ చైర్మన్ నెక్కల నాయుడు బాబు కుమార్తె దివ్యనాయుడు, సుభాస్ వివాహ రిసెప్షన్‌కు హాజరై వధూవరుల్ని ఆశీర్వదించారు.