దుష్ప్రచారంపై ‘సీఐడీ’ సీరియస్‌.. త్వరలో రామోజీ, శైలజకు నోటీసులు

Chit Fund Case: Apcid Legal Action Against Margadarshi Over Fake Allegations - Sakshi

సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఎంసీఎఫ్‌ఎల్‌)పై న్యాయపరమైన చర్యలకు సీఐడీ సన్నద్ధమవుతోంది. ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. దర్యాప్తులో భాగంగా సీఐడీ చర్యలను వక్రీకరిస్తూ, దాని ప్రతిష్టకు భంగకరంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ వ్యవహరిస్తుండటం వివాదాస్పదమవుతోంది. ఉద్దేశపూర్వకంగానే దర్యాప్తు సంస్థతోపాటు అధికారుల గౌరవానికి భంగం కలిగిస్తూ మార్గదర్శి అవాస్తవాలను ప్రచారం చేస్తోందని.. తమ అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తోందని సీఐడీ గుర్తించింది.

తద్వారా కేసు దర్యాప్తును ప్రభావితం చేయాలన్నది మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ లక్ష్యమన్నది కూడా స్పష్టమైంది. అందుకే సీఐడీపై దుష్ప్రచారం చేస్తూ దర్యాప్తును ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఆ సంస్థ చైర్మన్‌ చెరుకూరి రామోజీరావు, ఎండీ చెరుకూరి శైలజ కిరణ్‌లపై న్యాయపరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు త్వరలోనే వారికి సీఐడీ నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం.

చదవండి: ‘థ్యాంక్యూ సీఎం సార్‌’.. సీపీఎస్‌కు బదులు మెరుగైన జీపీఎస్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top