గ్రామీణాభివృద్ధిలో ఏపీ భేష్‌ | Central Govt team praises Andhra Pradesh For Rural Development | Sakshi
Sakshi News home page

గ్రామీణాభివృద్ధిలో ఏపీ భేష్‌

Jun 26 2021 5:00 AM | Updated on Jun 26 2021 5:00 AM

Central Govt team praises Andhra Pradesh For Rural Development - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును కేంద్రం ప్రశంసించింది. ఉపాధి హామీ పథకంతో పాటు పింఛన్ల పంపిణీ, భూ రికార్డుల ఆధునీకరణ, ఇళ్ల నిర్మాణం తదితర కార్యక్రమాల అమలు తీరును పరిశీలించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల బృందం గతేడాది దేశంలోని 24 రాష్ట్రాల పరిధిలోని 233 జిల్లాల్లోని 2,330 గ్రామాల్లో పర్యటించింది. గతేడాది అక్టోబరులో మన రాష్ట్రంలోనూ నాలుగు జిల్లాల పరిధిలో 40 గ్రామాలను కేంద్ర అధికారులు సందర్శించారు.

ఆ వివరాలతో ‘నేషనల్‌ లెవల్‌ మానిటరింగ్‌’ పేరుతో కేంద్రం తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో శుక్రవారం వర్చువల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశం నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలోనూ, ఉపాధిహామీ  అమలులోనూ ఏపీ వంద శాతం పనితీరు కనబరుస్తున్నదంటూ కేంద్ర అధికారులు ప్రశంసించారు.  వర్చువల్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో ఉపాధి హామీ పథకం డైరెక్టర్‌ చిన్నతా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement