బీఆర్‌ నాయుడును చంద్రబాబు దూరం పెట్టారా? | BR Naidu Skips CM Chandrababu's Tirumala Review Meeting | Sakshi
Sakshi News home page

బీఆర్‌ నాయుడును చంద్రబాబు దూరం పెట్టారా?

Mar 21 2026 3:44 PM | Updated on Mar 21 2026 5:42 PM

BR Naidu Skips CM Chandrababu's Tirumala Review Meeting

తిరుమల:  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటనలో మరో వివాదం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశానికి టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు గైర్హాజరయ్యారు. కనీసం సీఎం చంద్రబాబు స్వాగత కార్యక్రమంలో కూడా బీఆర్‌ నాయుడు కనిపించలేదు. టీటీడీ చైర్మన్‌ హోదాలో ఉన్న వ్యక్తి.. సీఎం  చంద్రబాబుకు ఎందుకు స్వాగతం చెప్పలేదు.. సమీక్షా సమావేశానికి ఎందుకు గైర్హాజరయ్యారనేది అనేక సందేహాలకు తావిచ్చింది.

బీఆర్‌ నాయుడిని సీఎం చంద్రబాబు కావాలనే దూరం పెట్టారా? అనే అనుమానం వస్తుంది. ఇటీవల బీఆర్‌ నాయుడు రాసలీలల వీడియోలు సోషల్‌  మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టడమే ఇందుకు కారణం కావచ్చొనది పలువురి అభిప్రాయంగా ఉంది. 

వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లో సీఎం చంద్రబాబు.. టీటీడీ అధికారులతో సమావేశమయ్యారు. మరి అటువంటి సమావేశానికి టీటీడీ చైర్మన్‌ హోదాలో ఉన్న వ్యక్తి ఎందుకు హాజరు కాలేదనేది ఇక్కడ ప్రశ్న. టీటీడీలో అంతర్గత విభేదాలా.. లేక ప్రోటోకాల్‌ వివాదమా? అనేది అధికార వర్గాల్లో చర్చకు దారి తీసింది. 

BR నాయుడుకు షాక్ ఇచ్చిన చంద్రబాబు?

 

Advertisement
 
Advertisement
Advertisement