బ్యాటరీ మింగేసిన చిన్నారి | Battery removed from child stomach through endoscopy in West Godavari | Sakshi
Sakshi News home page

బ్యాటరీ మింగేసిన చిన్నారి

Published Sun, Jun 16 2024 11:19 AM | Last Updated on Sun, Jun 16 2024 11:47 AM

Battery removed from child stomach through endoscopy in West Godavari

పశ్చిమగోదావరి: ఆడుకునే బొమ్మలో ఉండే చిన్న బ్యాటరీని పొరపాటున 11 నెలల పాప మింగేసింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగింది. ఈ విషయాన్ని గుర్తించిన చిన్నారి తల్లి.. వెంటనే స్థానిక ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు చిన్నారిని పరీక్షించి విజయవాడకు తీసుకెళ్లాలని రిఫర్‌ చేశారు. దీంతో హుటాహుటిన  అంబులెన్స్‌లో విజయవాడలోని ఆయుష్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు.

డాక్టర్లు చిన్నారి పొట్టను ఎక్స్‌రే తీసి పరిశీలించారు. కడుపు, ఛాతి మధ్య భాగంలో బ్యాటరీ ఇరుక్కున్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఆపరేషన్ అవసరం లేకుండానే వైద్యులు ఎండోస్కోపీ ద్వారా చిన్నారి పొట్టలోని బ్యాటరీని  బయటకు తీశారు. ఘటన జరిగిన వెంటనే తల్లిదండ్రులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తీసుకురావడంతో ప్రమాదం తప్పిందని వైద్యులు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement