బాలు గారికి భారతరత్న ఇవ్వాలి: నందిగామ సురేష్

Bapatla MP Says SP Balasubramanyam Should Get Bharat Ratna  - Sakshi

సాక్షి, విజయవాడ: గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చనిపోవడం దురదృష్టకరమని బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ తెలిపారు. నందిగామ సురేష్ మాట్లాడుతూ.. బాలు గారు భౌతికంగా మనకు దూరమైనా, ఆయన పాటలు మనతోనే ఉంటాయని అన్నారు. తాను చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూ పెరిగానని, బాలు గారు ఒక గొప్ప వ్యక్తి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు నందిగామ సురేష్ తెలిపారు.

కాగా జీవితంలో ఒక్కసారైనా బాలసుబ్రమణ్యం గారిని కలవాలనే కోరిక ఉండేదని, ఆ కోరిక తనకు తీరలేదని అన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారి కీర్తి, గౌరవానికి, తగినట్టుగా భారతరత్న ఇస్తే ఆయన అభిమానులకు ఊరట కలుగుతుందనే నమక్కం ఉందన్నారు. దీనికి తన వంతు సహాయం చేస్తానని నందిగామ సురేష్ పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top