వైఎస్‌ఆర్‌ కుటుంబానికి నేను ఎప్పుడూ విధేయుడినే..

Balineni Srinivasa Reddy Key Comments On CM Jagan - Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి సమావేశం ముగిసింది. అనంతరం తనకు కేబినెట్‌లో చోటు దక్కకపోవడంపై బాలినేని శ్రీనివాస్‌ స‍్పందించారు. 

బాలినేని మీడియాతో మాట్లాడుతూ..  వైఎస్‌ కుటుంబానికి తాను ఎప్పుడూ విధేయుడినేనని స్పష్టం చేశారు. తాను రాజీనామా చేస్తున్నాననే వార్తలను ఖండించారు. పదవి కోసం ఎప్పుడూ పాకులాడలేదని.. పార్టీ కోసమే పని చేశానని అన్నారు. సీఎం జగన్‌ ఏ బాధ్యతలు ఇచ్చినా స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నానని వెల్లడించారు. పార్టీ ఒక కుటుంబం.. అందరూ కలిసి మెలిసి ఉండాలన్నదే తన ఉద్దేశ్యమన్నారు. పార్టీకి గతంలో కంటే ఎక్కువ సీట్లు వచ్చేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. 

సామర్థ్యం ఉన్న వారినే సీఎం జగన్‌ కేబినెట్‌లోకి తీసుకున్నారు.  ఆదిమూలపు సురేష్‌తో తనకు ఎలాంటి విబేధాలు లేవని ఈ సందర్బంగా క్లారిటీ ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 70 శాతం మంత్రి పదవులు ఇచ్చిన ఏకైక పార్టీ వైఎస్‌ఆర్‌సీపీనే అని బాలినేని ప్రశంసించారు. అందరికీ పదవులు ఒకేసారి రావు అని అన్నారు. సీఎం జగన్‌ నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తామని తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top