APSRTC: తప్పట్లేదు.. డీజిల్‌ సెస్‌ పెంచుతున్నాం

ASRTC Bus Fare Increased 2022 Check Details - Sakshi

సాక్షి, విజయవాడ: డీజిల్‌ ధరలు పెరగడంతో ఆర్టీసీపై భారం పడిందని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డీజిల్‌ బల్క్‌ రేటు విపరీతంగా  పెరిగిందని పేర్కొన్నారు. నిర్వహణ ఖర్చు కూడా రాకపోతే పూర్తి నష్టాల్లోకి వెళుతుందని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో డిజీల్‌ సెస్‌ కింద పెంచాల్సి వస్తోందని పేర్కొన్నారు.

డీజిల్‌ సెస్‌ కింద పెంపు..
పల్లెవెలుగు సర్వీసులపై రూ. 2 పెంపు.. 
ఇకపై పల్లె వెలుగు బస్సుల్లో మినిమమ్‌ ఛార్జీ 10రూ. గానిర్ధారణ
ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులపై  రూ. 5 పెంపు
ఏసీ బస్సుల్లో రూ. 10 పెంపు

తప్పనిసరి పరిస్థితుల్లో పెంపుదల తప్పట్లేదన్న ఆయన.. ఇది ఛార్జీల పెంపు కాదని గుర్తించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. పెంచిన ధరలు రేపటి(ఏప్రిల్‌ 14) నుంచే అమలులోకి రానున్నాయి. ప్రయాణికులు అర్థం చేసుకొని సహకరిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. పల్లెవెలుగు కనీస ఛార్జీ ఇకపై రూ.10గా నిర్ణయించామని తెలిపారు. కరోనా వల్ల ఆర్టీసీ ఆదాయానికి గండి పడిందని పేర్కొన్నారు. ఆర్టీసీపై రోజుకు రూ.3.5 కోట్ల భారం పడుతోందని తెలిపారు. రెండేళ్లుగా ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదని పేర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే పెంపు నిర్ణయించామని తెలిపారు. డీజిల్‌ సెస్‌ మాత్రమే పెరుగుదల అని పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top