నిరుద్యోగం రయ్‌ రయ్‌! | AP ranks third in the country in unemployment | Sakshi
Sakshi News home page

నిరుద్యోగం రయ్‌ రయ్‌!

Aug 31 2026 5:36 AM | Updated on Aug 31 2026 5:36 AM

AP ranks third in the country in unemployment

నిరుద్యోగితలో దేశంలో మూడో స్థానంలో ఏపీ 

పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌  సర్వే నివేదిక వెల్లడి 

జాతీయ స్థాయిని మించి ఏపీలో నిరుద్యోగిత 

అటు ఉపాధి లేక ఇటు నిరుద్యోగ భృతి అందక యువత సతమతం

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగంలో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య నిరుద్యోగంలో ఏపీ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. అంతేకాదు.. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు నిర్వహించిన పీరియాడిక్‌ లేబర్‌  ఫోర్స్‌ సర్వేలో నిరుద్యోగితతో పోల్చితే ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు భారీగా పెరిగింది. ఈ విషయాన్ని లేబర్‌ ఫోర్స్‌ సర్వే నివేదిక వెల్లడించింది. 

ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య ఏపీలో నిరుద్యోగిత 6.1 శాతం ఉంటే... ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య నిరుద్యోగిత 7.5 శాతానికి పెరగడం గమనార్హం. అంటే నిరుద్యోగం 1.4 శాతం మేర పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది. జాతీయ స్థాయిని మించి రాష్ట్రంలో నిరుద్యోగిత ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.  

జాతీయ స్థాయిని మించి..     
» జాతీయ స్థాయిలో నిరుద్యోగిత 5.4 శాతం ఉండగా, రాష్ట్రంలో 7.5 శాతం నిరుద్యోగిత నమోదైంది. 
» రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోనే నిరుద్యోగిత ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత 7.4 శాతం ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 7.7 శాతం ఉంది. 
»  పురుషుల కంటే మహిళల నిరుద్యోగిత శాతం ఏపీలో ఎక్కువగా ఉంది. ఏపీలో మహిళల నిరుద్యోగిత 9.3 శాతం ఉండగా, పురుషుల నిరుద్యోగిత 6.4 శాతం ఉంది. 
»   గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల నిరుద్యోగిత 6.6 శాతం ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 6.1 శాతం ఉంది. 
» మహిళల నిరుద్యోగిత గ్రామీణ ప్రాంతాల్లో 8.6 శాతం ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 11.1 శాతం ఉంది.  

సర్వే సాక్షిగా తేలిన నిజం.. 
నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదంటే నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోయాయి. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా హామీని నెరవేర్చకుండా నిరుద్యోగ భృతికి ఎగనామం పెట్టారు. దీంతో రాష్ట్రంలో యువతకు ఉపాధి లభించడం లేదు. నిరుద్యోగిత భారీగా పెరిగిపోతోంది. ఇదే విషయం లేబర్‌ ఫోర్స్‌ సర్వే సాక్షిగా వెల్లడైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement