ఆక్సిజన్‌ సేకరణ, పంపిణీలో ఏపీ పురోగతి

AP progress in oxygen collection and distribution - Sakshi

రాష్ట్రంలో వివిధ ఆస్పత్రులకు విస్తృతంగా ఆక్సిజన్‌ 

సీఎం చర్యలతో ఆక్సిజన్‌ సరఫరా వేగవంతం

కొత్తగా 3 ఐఎస్‌వో ట్యాంకులు, మొత్తంగా 6 ట్యాంకులు

జామ్‌నగర్‌ నుంచి 110 టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ 

పర్యవేక్షణ అధికారి కృష్ణబాబు 

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 ఉధృతి నేపథ్యంలో ఒకేసారి పెరిగిన డిమాండ్‌కు తగినంతగా ఆక్సిజన్‌ సేకరణ, పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం గణనీయ పురోగతి సాధించిందని ఆక్సిజన్‌ సేకరణ, సరఫరాను పర్యవేక్షణ చేస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి టి.కృష్ణబాబు తెలిపారు. ఆక్సిజన్‌పై ప్రధానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖతో సానుకూల పరిస్థితి వచ్చిందన్నారు.

కేంద్రం.. రాష్ట్రానికి కొత్తగా మరో మూడు ఐఎస్‌వో ట్యాంకులను ఇవ్వనుందని తెలిపారు. ఈ ట్యాంకులను శనివారం మధ్యాహ్నం దుర్గాపూర్‌లో అప్పగించనుందన్నారు. ఆదివారం నాటికి కృష్ణపట్నంకు 60 టన్నుల ఆక్సిజన్‌తో ప్రత్యేక రైలు చేరుకోనుందని పేర్కొన్నారు. ఇప్పటికే దుర్గాపూర్‌ స్టీల్‌ ఫ్యాక్టరీలో 2 కొత్త ట్యాంకుల్లో ఆక్సిజన్‌ను అధికారులు నింపారని, ఒక్కో ట్యాంకులో 20 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్, మొత్తంగా 40 మెట్రిక్‌ టన్నులు వస్తుందన్నారు.

ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా శనివారం నెల్లూరులోని కృష్ణపట్నంకు ఆక్సిజన్‌ ట్యాంకులు చేరుకుంటాయని, మొత్తంగా రాష్ట్రానికి 6 ఐఎస్‌ఓ ట్యాంకుల ద్వారా ఆక్సిజన్‌ రానుందని ఆయన తెలిపారు. ఒక్కో ప్రత్యేక రైలు ద్వారా మూడు ట్యాంకుల చొప్పున నిరంతర ఆక్సిజన్‌ సరఫరాకు ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. ఒక్కో ట్రిప్పులో 60 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను ప్రత్యేక రైలు తీసుకురానుందని తెలిపారు. ఒడిశాలో వివిధ కర్మాగారాల నుంచి ఈ ఆక్సిజన్‌ను సేకరించనున్నట్లు ఆయన వెల్లడించారు. తద్వారా నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లోని ప్రభుత్వాసుపత్రులకు రిజర్వ్‌లో ఆక్సిజన్‌ నిల్వలు ఉంచగలగుతామన్నారు. మరోవైపు గుజరాత్‌లోని జామ్‌నగర్‌ రిలయన్స్‌ ఫ్యాక్టరీ నుంచి మరో 110 టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ శనివారం రైలు ద్వారా గుంటూరు చేరుకోనుందని తెలిపారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

15-05-2021
May 15, 2021, 11:09 IST
లండన్‌: గతేడాది ఇంగ్లాండ్‌ దేశాన్ని కరోనా మహమ్మారి అల్లకల్లోలం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ దేశం కరోనాపై విజయం సాధిస్తున్నట్లు కనిపిస్తోంది....
15-05-2021
May 15, 2021, 10:49 IST
ఎంజీఎం/వరంగల్‌ : ఎన్నో ఆశలతో తమ ప్రాణాలు నిలుస్తాయనే భావనతో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి వచ్చే వారికి నిరాశే మిగులుతోందని బీజేపీ...
15-05-2021
May 15, 2021, 09:39 IST
లక్డీకాపూల్‌: కోవిడ్‌ సెకండ్‌వేవ్‌ ఉధృతి నేపథ్యంలో ఆసుపత్రుల్లో పడకలు దొరకని పరిస్థితి. అతికష్టం మీద పడక సమస్య తీరినా.. వెంటిలేటర్‌...
15-05-2021
May 15, 2021, 08:52 IST
కుటుంబానికంతా సోకిన వైరస్‌. ఈ క్రమంలో వృద్ధురాలు మృతి. అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ లేకపోవడంతో స్పందించిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి. ...
15-05-2021
May 15, 2021, 08:47 IST
రెండు నెలల నుంచి 250 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా.. ఐసోలేషన్‌ అయిన వారందరికీ అవసరమైన సేవలను అందజేశారు. 
15-05-2021
May 15, 2021, 08:27 IST
ఈ 4 గంటల సమయం తమకు తక్కువని భావిస్తున్న అనేక మంది నగరవాసులు ఒక్కసారిగా బయటకు వచ్చేస్తున్నారు.
15-05-2021
May 15, 2021, 05:25 IST
సత్యనారాయణపురం(విజయవాడ సెంట్రల్‌): కోవిడ్‌ వ్యాక్సిన్‌లను విక్రయిస్తున్న ఓ ప్రభుత్వ వైద్యాధికారిని పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. జీ కొండూరు మండలం...
15-05-2021
May 15, 2021, 05:24 IST
ముంబై: కరోనా వైరస్‌ బారినపడి, చికిత్సతో పూర్తిగా కోలుకున్నప్పటికీ బ్లాక్‌ ఫంగస్‌ ముప్పు భయపెడుతోంది. అరుదుగా వచ్చే ఈ ఫంగస్‌...
15-05-2021
May 15, 2021, 05:04 IST
వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా కరోనా నుంచి ఊపిరి పీల్చుకుంటోంది. రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయిన వారు ఇకపై మాస్కు ధరించాల్సిన...
15-05-2021
May 15, 2021, 04:58 IST
సాక్షి, న్యూఢిల్లీ: అత్యంత కఠిన పరిస్థితులు ఎదురైనా సరే భారతీయులు ఆత్మవిశ్వాసం కోల్పోరని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆ...
15-05-2021
May 15, 2021, 04:50 IST
సాక్షి, అమరావతి: దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కరోనా సెకండ్‌ వేవ్‌ భారీగా గండికొడుతోంది. లక్షలాది మంది తమ ఉద్యోగాలు,...
15-05-2021
May 15, 2021, 04:33 IST
న్యూఢిల్లీ: ఆసుపత్రిలో పడకల కోసం ఇంతటి క్లిష్టమైన పరిస్థితి వస్తుందని ఏనాడు ఊహించలేదని, ఇది హృదయవిదారకమని భారత టెస్టు బ్యాట్స్‌మన్,...
15-05-2021
May 15, 2021, 04:23 IST
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ (డీఆర్‌ఎల్‌) నికర...
15-05-2021
May 15, 2021, 04:18 IST
తిరుపతి రూరల్‌: చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని తొండవాడలో హీరా కళాశాలకు చెందిన ఐదు అంతస్తుల భవనంలో అత్యాధునిక వైద్య...
15-05-2021
May 15, 2021, 04:13 IST
ఒంగోలు టౌన్‌: పేదల ఆరోగ్యం కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడబోమని రాష్ట్ర విద్యుత్, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు....
15-05-2021
May 15, 2021, 03:36 IST
సైనసైటిస్‌ (ముక్కు లేదా శ్వాసకు సంబంధించిన అలర్జీ) ఉన్న వారిలో ఎక్కువగా వస్తున్నట్టు నిపుణులు గుర్తించారు. బ్లాక్‌ ఫంగస్‌పై ఆందోళన...
14-05-2021
May 14, 2021, 21:26 IST
సాక్షి, హైదరాబాద్‌:  రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ను డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ శుక్రవారం లాంచ్‌ చేసింది. త్వరలోనే ఇది మార‍్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది. ఈ...
14-05-2021
May 14, 2021, 21:25 IST
న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీలోని దిల్షద్‌ గార్డెన్‌ నివాసి అయిన శశాంక్‌‌ శేఖర్‌(26) పుట్టుకతోనే అంధుడు. అదే లోపం ఉన్న మరో...
14-05-2021
May 14, 2021, 20:40 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ను జయించిన వారిలో ఆ ఆనందం ఎక్కువ కాలం ఉండంటం లేదు. బ్లాక్‌ ఫంగస్‌ రూపంలో మరో సమస్య...
14-05-2021
May 14, 2021, 18:52 IST
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మరణాల లెక్కలకు సంబంధించి తాజా అధ్యయనం షాకింగ్‌ అంచనాలను వెలువరించింది. అనేక దేశాలు వాస్తవ గణాంకాల...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top