AP: ప్రమాణ స్వీకారం అనంతరం కొత్త మంత్రులు ఏమన్నారంటే?

AP New Ministers Response After Swearing In Ceremony - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేబినెట్‌లో అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని నూతన మంత్రి ఉషాశ్రీచరణ్‌ అన్నారు. కేబినెట్‌లో మహిళలకు సముచిత స్థానం కల్పించారన్నారు. సీఎం జగన్‌ అప్పజెప్పిన పనిని బాధ్యతగా చేస్తానని తెలిపారు.

చదవండి: ఏపీ కొత్త మంత్రులు: ఇంగ్లీష్‌లో ప్రమాణం చేసింది వీరే..

అదృష్టంగా భావిస్తున్నాం: రాజేంద్రనాథ్‌
సీఎం వైఎస్‌ జగన్‌ కేబినెట్‌లో పనిచేస్తున్నందుకు అదృష్టంగా భావిస్తున్నానని మంతి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. మూడేళ్లు సమర్ధవంతంగా పాలన కొనసాగిందన్నారు. అన్ని వర్గాలకు సముచితస్థానం కల్పిస్తూనే కొత్త మంత్రి వర్గం ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షం కావాలనే బురద జల్లేందుకు యత్నిస్తోందన్నారు. 

మంచి పేరు తెచ్చుకుంటా: అంబటి రాంబాబు
మంత్రి పదవి రావడం చాలా సంతోషంగా ఉందని అంబటి రాంబాబు అన్నారు. సీఎం వైఎస్‌.జగన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నారు. ప్రజలకు మరింత సేవ చేసేందుకు ముందుంటానని చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు సీఎం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. వైఎస్‌. జగన్‌ టీమ్ లీడర్.. తామంతా మెంబర్స్. మంచి చేసినా చంద్రబాబు, టీడీపీ నేతలు విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు ఏనాడు మంత్రులకు విలువ ఇవ్వలేదన్నారు. టీడీపీ చేయలేని అద్భుత కార్యక్రమాలు సీఎం వైఎస్‌ జగన్‌ చేస్తున్నారు. చిత్తశుద్ధిగా పనిచేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటానని అంబటి రాంబాబు అన్నారు.

ఎప్పటికీ మర్చిపోను: ఆర్కే రోజా
సీఎం జగన్‌ ఇచ్చిన గుర్తింపు ఎప్పటికీ మర్చిపోనని ఆర్కే రోజా అన్నారు. జగనన్న రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు మంత్రిగా అవకాశమిచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. సీఎం కేబినెట్‌లో మహిళ మంత్రిగా ఉండటం తన అదృష్టం అన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు జగనన్న కోసం పని చేస్తానన్నారు. ఏ శాఖ ఇచ్చినా సమర్ధవంతంగా పని చేస్తానన్నారు.

నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం..
సీఎం జగన్‌ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన దాడిశెట్టి రాజా, కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు వచ్చేలా కృషి చేస్తామన్నారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top