Jagananna Vidya Kanuka: తొలిరోజు నుంచే పంపిణీ

AP Government Provide Jagananna Vidya Kanuka For Third Year - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రేపటి(మంగళవారం) నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న తరుణంలో విద్యార్ధుల కోసం జగనన్న విద్యాకానుక కిట్లను మూడో ఏడాది అందించేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సిద్దమైంది. 

విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సంస్కరణలు చేపట్టింది. మన బడి నాడు నేడు కింద రూ. వేల కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. జగనన్న విద్యాకానుక కింద విద్యార్ధుల చదువులకు అవసరమయ్యే వస్తువులను కిట్ల రూపంలో అందిస్తోంది. జగనన్న గోరుముద్ద ద్వారా రుచికరమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని సమకూరుస్తోంది. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు ఏటా పెరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేపట్టింది. 

విద్యపై పెట్టే వ్యయం విద్యార్ధుల భవిష్యత్‌కు పెట్టుబడి అనే మహోన్నత ఆలోచనతో సీఎం వైఎస్‌ జగన్‌ ఏటా విద్యారంగానికి బడ్జెట్‌లో వేల కోట్లు కేటాయింపులు చేస్తున్నారు. బడులు తెరిచిన తొలిరోజే జగనన్న విద్యాకానుక క్రింద అందజేసే వస్తువులు. 1. ప్రతి విద్యార్ధికి ఉచితంగా 3 జతల యూనిఫాం క్లాత్‌ కుట్టుకూలితో సహా, 2. ఒక జతల బూట్లు, 3. రెండు జతల సాక్సులు, 4. బెల్టు, 5. స్కూలు బ్యాగు, 6. బై లింగువల్‌ టెక్ట్స్‌బుక్స్, 7. నోట్‌బుక్స్‌. 8. వర్క్‌బుక్స్‌తో పాటు అదనంగా ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లీషు – తెలుగు డిక్షనరీని ప్రభుత్వం అందజేస్తుంది.

బోధనా కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా ఈ నెల 5 నుంచి నెలాఖరు వరకు విద్యాకానుక కిట్లను విద్యార్ధులకు అందజేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటి నుండి పదో తరగతి వరకు చదువుతున్న 47,40,421 మంది విద్యార్ధినీ, విద్యార్ధులకు రూ. 931.02 కోట్ల ఖర్చుతో సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా లాంఛనంగా మంగళవారం కర్నూలు జిల్లా ఆదోనిలో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ జరుగనుంది. 

ప్రతీ విద్యార్ధికీ దాదాపు రూ. 2,000 విలువైన జగనన్న విద్యా కానుక ద్వారా అందనున్నాయి. 2020 –21 విద్యా సంవత్సరంలో 42,34,322 లక్షల మంది విద్యార్ధులు లబ్ధి పొందగా, దానికి అయిన వ్యయం రూ. 648.10 కోట్లు. 2021 –22 విద్యా సంవత్సరంలో 45,71,051 లక్షల మంది విద్యార్ధులు లబ్ధి పొందగా, దానికి అయిన వ్యయం రూ. 789.21 కోట్లు. 2022 –23 విద్యా సంవత్సరంలో 47,40,421 లక్షల మంది విద్యార్ధులు లబ్ధి పొందనున్నారు. దానికి అయిన వ్యయం రూ. 931.02 కోట్లు. ఇదంతా కలిపి ఇప్పటివరకు చేసిన మొత్తం వ్యయం 2,368.33 కోట్లు.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం విద్యారంగంలో ప్రవేశపెట్టిన విప్లవాత్మక చర్యల వల్ల 2018 – 19 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 10 వ తరగతి వరకు 37.21 లక్షలుగా ఉన్న విద్యార్ధుల సంఖ్య 7 లక్షలుకు పైగా పెరిగి 2021 – 22 నాటికి 44.30 లక్షలకు చేరింది. అదే సమయంలో ప్రభుత్వ, ప్రేవేట్‌ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య 2 లక్షలకు పైగా పెరిగి 72.47 లక్షలకు చేరింది. 

గత ప్రభుత్వంలో స్కూల్స్‌ తెరిచి 6–7 నెలలు అయినప్పటికీ యూనిఫార్మ్‌ల సంగతి దేవుడెరుగు, కనీసం పాఠ్యపుస్తకాలు కూడా అందించలేని దుస్ధితి ఉండేది. ఇక ఇతర వస్తువుల ఊసేలేదు. ఈ పరిస్ధితిని సమూలంగా మారుస్తూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో పాఠశాలలు తెరిచిన రోజు నుండే జగనన్న విద్యా కానుక కిట్‌ అందజేస్తున్నారు. 

కట్టుబాట్ల నుండి స్వేచ్ఛలోకి..

బాలికల డ్రాపౌట్‌ రేట్‌ను తగ్గించాలన్న లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 7 నుండి 12 వ తరగతి వరకు చదువుతున్న 10 లక్షల మందికి పైగా విద్యార్ధినులకు స్వేచ్ఛ ద్వారా ఏటా రూ. 32 కోట్ల వ్యయంతో నెలకు 10 చొప్పున ఏడాదికి 120 నాణ్యమైన బ్రాండెడ్‌ శానిటరీ న్యాప్‌కిన్లు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్నది. మన బడి నాడు – నేడు ద్వారా విద్యాసంస్ధల్లో బాలికలకు ప్రత్యేక టాయిలెట్ల నిర్మాణం కూడా చేపట్టిన ప్రభుత్వం.

అర్హులందరికీ క్రమం తప్పకుండా కుల, మత, పార్టీ వివక్ష లేకుండా, లంచాలకు తావులేకుండా పారదర్శకంగా పథకాలు అందిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ముందుకెళుతున్నది?

విద్యారంగంలో సంస్కరణలపై ప్రభుత్వం 36 నెలల్లో చేసిన వ్యయం వివరాలు..

- జగనన్న అమ్మ ఒడి పథకం లబ్ధిదారుల సంఖ్య 44,48,865 లక్షలకు గాను అందించిన మొత్తం రూ. 19,617.53 కోట్లు. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకమే లేదు. 

- జగనన్న విద్యా దీవెన లబ్ధిదారుల సంఖ్య 21,55,298 లక్షలు, జగనన్న వసతి దీవెన లబ్ధిదారుల సంఖ్య 18,77,863 లక్షలకు గాను, రెండింటికీ కలిపి అందించిన మొత్తం రూ. 11,007.17 కోట్లు. గత ప్రభుత్వంలో ఇచ్చినవే అరకొర ఫీజులు, అవీ ఏళ్ళ తరబడి పెండింగ్‌లు, గత ప్రభుత్వం పెట్టిన ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ బకాయిలు రూ. 1,778 కోట్లు కూడా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమే చెల్లించింది.  

- జగనన్న విద్యా కానుక లబ్ధిదారుల సంఖ్య 47,40,421 లక్షలకు గాను అందించిన మొత్తం రూ. 2,368.33 కోట్లు. గత ప్రభుత్వంలో స్కూల్స్‌ తెరిచి 6–7 నెలలు అయినప్పటికీ యూనిఫార్మ్‌ల సంగతి దేవుడెరుగు, కనీసం పాఠ్యపుస్తకాలు కూడా అందించలేని దుస్ధితి, ఇక ఇతర వస్తువుల ఊసేలేదు. 

- జగనన్న గోరుముద్ద లబ్ధిదారుల సంఖ్య 43,26,782 లక్షలకు గాను అందించిన మొత్తం రూ. 3,087.50 కోట్లు. గతంలో నాసిరకం ఆహారం, ఉడికీ ఉడకని అన్నం, రుచీపచీ లేని కూరలు, ఆయాల జీతాలు సైతం 8–9 నెలలు పెండింగ్‌లోనే ఉన్నాయి.

- పాఠశాలల్లో నాడు నేడు మొదటి దశలో 15,715 స్కూళ్ళకి అందించిన మొత్తం రూ. 3,669.00 కోట్లు, రెండోదశలో 22,344 స్కూళ్ళకి అందించిన మొత్తం రూ. 8,000.00 కోట్లు. మూడు దశల్లో రూ. 16,450 కోట్ల వ్యయంతో మొత్తం 56,572 స్కూల్స్‌లో అభివృద్ది పనులు. గతంలో శిధిలావస్ధలో బడులు, సౌకర్యాల లేమి. 

- వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ లబ్ధిదారుల సంఖ్య 34,19,875 లక్షలకు గాను అందించిన మొత్తం రూ. 4,895.45 కోట్లు. గతంలో నామమాత్రంగా పౌష్టికాహారం, అదీ కొందరికే పరిమితం

- స్వేచ్ఛ (శానిటరీ న్యాప్‌కిన్స్‌) లబ్ధిదారుల సంఖ్య 10.01,860 లక్షలకు గాను అందించిన మొత్తం రూ. 32 కోట్లు. గత ప్రభుత్వంలో లేదు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top