ఏపీలో పింఛన్ల పండగ.. తెల్లవారుజాము నుంచే పెన్షన్ల పంపిణీ | Sakshi
Sakshi News home page

ఏపీలో పింఛన్ల పండగ.. తెల్లవారుజాము నుంచే పెన్షన్ల పంపిణీ

Published Thu, Dec 1 2022 8:48 AM

AP Government Distribution of YSR Pension Kanuka - Sakshi

సాక్షి, అమరావతి/దేవరాపల్లి (అనకాపల్లి జిల్లా): రాష్ట్రవ్యాప్తంగా గురువారం తెల్లవారు జాము నుంచి అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగులతో పాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు  వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ కొనసాగుతుంది. ఇందుకోసం రూ.1,584.87 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల వారీగా ఆ ప్రాంతంలోని లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా పింఛన్‌ డబ్బును ప్రభుత్వం.. ఆయా సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.

తెల్లవారుజాము నుంచే వలంటీర్లు నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్‌ డబ్బులు అందజేస్తున్నారు. మధ్యాహ్నం 1:30 గంటల వరకు 77.89 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు. 48.53 లక్షల మందికి రూ.1233.96 కోట్లు అందజేశారు. సాంకేతిక కారణాలతో ఏ ఒక్కరికీ పింఛన్‌ అందలేదనే ఫిర్యాదులు రాకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. పింఛన్ల పంపిణీని ఐదు రోజుల్లోగా నూరు శాతం పూర్తి చేయాలని ఆదేశించినట్లు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు.
చదవండి: చిన్నారి పరిస్థితి చూసి చలించిపోయిన సీఎం జగన్‌  

Advertisement
Advertisement