నీటిచార్జీల హేతుబద్ధీకరణ

AP Government Approval For Proposals Of Water Charges - Sakshi

టీడీపీ ప్రభుత్వంలో అధికంగా నిర్ణయించిన చార్జీల తగ్గింపు

ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదం

సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాల్లో టీడీపీ ప్రభుత్వం అహేతుకంగా నిర్ణయించిన నీటిచార్జీలను రాష్ట్ర ప్రభుత్వం హేతుబద్ధీకరించింది. ప్రజ లు, వ్యాపార, పారిశ్రామిక సంస్థలకు అధికభారం లేకుండా నీటిపన్నుల తగ్గింపు ప్రతిపాదనలు ఆమోదించింది. ఈమేరకు పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో కుళాయిలకు మీటర్లు ఏర్పాటు చేసి గృహ, (వ్యక్తిగత ఇళ్లు, అపార్టుమెంట్లకు వేర్వేరుగా), వాణిజ్య, పారిశ్రామిక కేట గిరీల కింద నీటిచాచార్జీలను అమాంతంగా పెంచింది. దీన్ని వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం సమీక్షించింది.

పురపాలకశాఖ ప్రతిపాదనల మేరకు రాష్ట్ర పురపాలకశాఖ కమిషనర్‌/డైరెక్టర్‌ అధ్యక్షుడిగా ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్, సూపరింటెం డెంట్‌ ఇంజినీర్‌ (పబ్లిక్‌ హెల్త్‌) సభ్యులుగా ఉన్న కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది. కొత్త నీటిచార్జీలు వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ చార్జీలను ఏటా 5 శాతం పెంచుకునేందుకు అవకాశం కల్పించారు. 

సీవరేజీ చార్జీల హేతుబద్ధీకరణ
నగరాలు, పట్టణాల్లో కొత్త చార్జీల అమలు
రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో సీవరేజీ చార్జీలను హేతుబద్ధీకరిస్తూ పుర పాలకశాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11 నగ రాలు, పట్టణాల్లో భూగర్భ మురుగునీటి పారుదలవ్యవస్థ (యూడీఎస్‌) ఉంది. ఆయా చోట్ల వేర్వేరు రీతుల్లో  సీవరేజీ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చార్జీలను హేతుబద్ధీకరిస్తూ ప్రతిపాదనలు రూపొం దించారు. ఈ ప్రతిపాదనల మేరకు నగరాలు, పట్టణాలు సీవరేజీ చార్జీల ను నిర్ణయించాలని పురపాలకశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top