కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్‌

AP Government Announces Minimum Pay Scale For Contract Employees - Sakshi

కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు మినిమం పే స్కేల్‌, మహిళా ఉద్యోగులకు మెటర్నటీ లీవ్‌

సాక్షి, అమరావతి: కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు మినిమమ్‌ పే స్కేల్‌ వర్తింపజేయాలని ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, సొసైటీలు, కేజీబీవీలు.. మోడల్ స్కూళ్లలో పనిచేసే కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు మినిమం పేస్కేల్‌ వర్తింపజేయాలని నిర్ణయించింది. వీరిలో కన్సల్టెంట్లు, సలహాదారులు, ఓఎస్డీలకు పే స్కేల్‌ వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

అలానే కాంట్రాక్ట్‌ మహిళా ఉద్యోగులకు 180 రోజుల మెటర్నిటీ లీవ్‌ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక ప్రమాదంలో మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి 5లక్షల రూపాయల సాయం.. సహజంగా మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి రూ.2లక్షల సాయం అందించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఖజానాపై రూ.365 కోట్ల రూపాయల భారం పడనున్నట్లు అంచనా వేసింది.

చదవండి: కాంట్రాక్ట్‌ ఉద్యోగుల పదవీ కాలం పొడిగింపు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top