Minimum Pay
-
కనీసం రూ.52,600 జీతం ఇవ్వాలి..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పునఃసమీక్ష కోసం ఏర్పాటైన 8వ కేంద్ర వేతన సంఘం (8th CPC) ముందు భారతీయ రైల్వే సాంకేతిక పర్యవేక్షకుల సంఘం (IRTSA) కీలక డిమాండ్లను ఉంచింది. రైల్వేలోని జూనియర్ ఇంజనీర్లు (JE), సీనియర్ సెక్షన్ ఇంజనీర్లు (SSE) సహా టెక్నికల్ సూపర్వైజర్ల బాధ్యతలు, ప్రమాదభరిత విధులు, సాంకేతిక నైపుణ్యాలను దృష్టిలో ఉంచుకుని కనీస ప్రాథమిక వేతనాన్ని ప్రస్తుత స్థాయి కంటే గణనీయంగా పెంచి రూ.52,600గా నిర్ణయించాలని సంఘం కోరింది.గత నెల హైదరాబాద్‌లో 8వ వేతన సంఘం ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఐఆర్టీఎస్ఏ సమగ్ర మెమోరాండం సమర్పించింది. సంఘం ప్రధాన కార్యదర్శి కె.వి. రమేష్ నేతృత్వంలోని బృందం రైల్వే టెక్నికల్ సిబ్బంది ఎదుర్కొంటున్న కెరీర్ స్తబ్దత, పదోన్నతుల కొరత, వేతన అసమానతలు, భత్యాల సమస్యలను సంఘం దృష్టికి తీసుకెళ్లింది.రైల్వే టిక్నికల్ సిబ్బంది డిమాండ్లు ఇవీ..సంఘం ప్రతిపాదనల ప్రకారం, మొత్తం ఉద్యోగులందరికీ ఒకే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వర్తింపజేయకుండా పోస్టు స్థాయి, బాధ్యతల ఆధారంగా వేర్వేరు ఫిట్మెంట్ ఫ్యాక్టర్లను అమలు చేయాలి. లెవల్-1 ఉద్యోగులకు 2.92, లెవల్-6 నుంచి 8 వరకు ఉన్న సాంకేతిక సిబ్బందికి 3.50, లెవల్-9 నుంచి 12 వరకు ఉన్న మధ్యస్థాయి అధికారులకు 3.80 ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను అమలు చేయాలని సూచించింది.అలాగే సీనియర్ సెక్షన్ ఇంజనీర్లకు గ్రూప్-బి గెజిటెడ్ హోదా కల్పించాలని, రైల్వేలో గ్రూప్-బి పోస్టుల సంఖ్యను పెంచాలని, సాంకేతిక సిబ్బందికి ప్రత్యేక రిస్క్, హార్డ్‌షిప్ అలవెన్సులు ఇవ్వాలని సంఘం డిమాండ్ చేసింది. నైట్ డ్యూటీ అలవెన్స్, ఓవర్‌టైమ్ అలవెన్స్, పీసీఓ అలవెన్స్ వంటి అంశాలపై కూడా పునఃసమీక్ష జరపాలని కోరింది.ప్రస్తుతం 8వ వేతన సంఘం దేశవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంస్థలు, వివిధ శాఖల ప్రతినిధుల అభిప్రాయాలను సేకరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2025లో 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయగా, సంఘం తన సిఫార్సులను 18 నెలల్లో సమర్పించే అవకాశం ఉంది. తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదే కావడంతో, ఉద్యోగ సంఘాల డిమాండ్లన్నీ యథాతథంగా అమలవుతాయా లేదా అనేది నివేదిక అనంతరం స్పష్టత రానుంది. -
కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్
సాక్షి, అమరావతి: కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమమ్ పే స్కేల్ వర్తింపజేయాలని ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, సొసైటీలు, కేజీబీవీలు.. మోడల్ స్కూళ్లలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం పేస్కేల్ వర్తింపజేయాలని నిర్ణయించింది. వీరిలో కన్సల్టెంట్లు, సలహాదారులు, ఓఎస్డీలకు పే స్కేల్ వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలానే కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగులకు 180 రోజుల మెటర్నిటీ లీవ్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక ప్రమాదంలో మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి 5లక్షల రూపాయల సాయం.. సహజంగా మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి రూ.2లక్షల సాయం అందించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఖజానాపై రూ.365 కోట్ల రూపాయల భారం పడనున్నట్లు అంచనా వేసింది. చదవండి: కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీ కాలం పొడిగింపు -
ట్రంప్ దెబ్బకు కుప్పకూలిన ఐటీ షేర్లు
భారత ఐటీ కంపెనీలకు షాకిస్తూ హెచ్-1బీ వీసాదారులకు ట్రంప్ తీసుకొచ్చిన కొత్త వేతన సవరణ చట్టంతో ఐటీ దిగ్గజ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్ టెక్నాలజీస్ల మార్కెట్ విలువ దాదాపు రూ.48వేల కోట్ల మేర తుడిచిపెట్టుకుపోయింది. మిడ్ సైజ్ ఐటీ కంపెనీల షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. టాటా సొల్యుషన్స్, మాస్టెక్, మైండ్ ట్రీ, ఎంఫాసిస్, కేపీఐటీ, ఎన్ఐఐటీ టెక్నాలజీస్, హెక్సావేర్, జియోమెట్రిక్ దాదాపు 5 శాతం మేర పడిపోతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్లో ఐటీ సబ్ ఇండెక్స్ 4 శాతం మేర క్షీణించి టాప్ సెక్టరల్ లూజర్‌గా ఉంది. హెచ్-1బీ వీసా హోల్డర్స్‌కు కనీస వేతనాన్ని 1,30,000 డాలర్లకు పెంచేలా ప్రతిపాదిస్తూ వేతన సంస్కరణ బిల్లును మంగళవారం కాంగ్రెస్ సభ్యుడు జో లోఫ్గ్రెన్ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. దీంతో దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీలు కుప్పకూలాయి. అమెరికాలోని స్థానికులకే కంపెనీలు ఎక్కువ ప్రాధాన్యమిచ్చేలా, కనీస వేతనం ఇప్పుడున్న దానికి రెట్టింపు ఉండేలా ఈ బిల్లును రూపొందించారు. ప్రస్తుతం భారత ఐటీ కంపెనీలు అమెరికాలో హెచ్-1బీ వీసా హోల్డర్స్‌కు 60వేల డాలర్ల వేతనాన్ని మాత్రమే ఇస్తున్నాయి. ఈ వేతనాన్ని రెట్టింపు చేస్తూ 1,30,000 డాలర్లుగా బిల్లులో ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన మరిన్ని వార్తలకై చదవండి (అమెరికా దిక్కులు పిక్కటిల్లేలా..) (ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్) (ట్రంప్ ‘నిషేధం’: ఐసిస్ విజయోత్సవాలు) (ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం!) (అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి) (ట్రంపోనమిక్స్ మనకు నష్టమా? లాభమా?) (ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి!) (ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సీఈవో!) (వీసా హోల్డర్స్పై ట్రంప్ కొరడా)


