AP: జిందాల్‌ స్టీల్‌ కంపెనీకి భూములు కేటాయింపు

AP Government Allots Land To Jindal Steel India Ltd Company At Nellore - Sakshi

నెల్లూరులో 860 ఎకరాల భూమి కేటాయించిన ఏపీ ప్రభుత్వం

సాక్షి, అమరావతి: జిందాల్‌ స్టీల్‌ ఆంధ్ర లిమిటెడ్‌ కంపెనీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భూములు కేటాయిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం 860 ఎకరాల భూములు కేటాయించింది. నెల్లూరు జిల్లా చిలుకూరు మండలం మొమిడిలో ఈ భూములు కేటాయించింది.

మొత్తం 7,500 కోట్ల రూపాయల పెట్టుబడితో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం జరగనుంది. స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా 2,500 మంది, పరోక్షంగా 15వేల మందికి ఉపాధి లభించనుంది. ఈ క్రమంలో ఏపీఐఐసీకి(ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రీయల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌) భూముల కేటాయింపునకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top