AP: ప్రశాంతంగా కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష

AP Constable Preliminary Exam January 22nd - Sakshi

సాక్షి, అమరావతి: కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 5లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. 997 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 6,100 పోస్టులకు 5.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

పరీక్ష కేంద్రాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సీసీ కెమెరాలతో పర్యవేక్షించారు. స్ట్రాంగ్ రూమ్‌లు, పరీక్ష కేంద్రాలు వద్ద పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆఖరు నిమిషంలో పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు పరుగులు తీశారు.

తిరుపతి: జిల్లా వ్యాప్తంగా కానిస్టేబుల్ పరీక్ష కు హాజరయ్యే అభ్యర్థులు చివరి నిమిషము కొందరు తడబాటుకు గురయ్యారు. పరీక్ష కేంద్రాలు  మారిపోవడంతో కానిస్టేబుల్స్ దగ్గరుండి ద్విచక్ర వాహనం పై తీసుకు వెళ్లి దించి సహకారం అందించారు. ఉరుకులు, పరుగులతో చివరి నిమిషం నిర్ణీత సమయము లోపు పరీక్ష కేంద్రాలకు హజరయ్యారు. ఉదయం 8.30 గంటలు నుంచే పరీక్ష కేంద్రాలకు అనుమతించడంతో 10 గంటలు లోపు చేరుకుని ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాశారు.

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top