AP CM YS Jagan to start 'Family Doctor' programme in Palnadu - Sakshi
Sakshi News home page

‘ఫ్యామిలీ డాక్టర్‌’ ప్రారంభం కోసం.. పల్నాడుకు సీఎం వైఎస్‌ జగన్‌

Apr 5 2023 1:03 PM | Updated on Apr 5 2023 9:43 PM

AP CM YS Jagan to start family doctor in Palnadu - Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌ అనే ప్రజా సంక్షేమ పథకం కోసం సీఎం వైఎస్‌ జగన్‌.. 

సాక్షి, తాడేపల్లి: ఫ్యామిలీ డాక్టర్‌ అనే మరో ప్రతిష్టాత్మక సంక్షేమ విధానానికి ఆంధ్రప్రదేశ్‌ వేదిక కాబోతోంది. ఇందుకోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. 

రేపు (ఏప్రిల్‌ 6వ తేదీ) సీఎం వైఎస్‌ జగన్‌ పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారాయన. అనంతరం కావూరు గ్రామంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

వైద్య, ఆరోగ్య సేవలు నలుమూలలా విస్తరించే ఉద్దేశం, అలాగే స్పెషలిస్టు డాక్టర్ల సేవలను నేరుగా అందించే ఉద్దేశ్యంతో   ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది సీఎం జగన్‌ ప్రభుత్వం. ఇప్పటికే దశలవారీగా ట్రయల్‌ రన్స్‌ నిర్వహించగా.. అంతటా సూపర్‌ సక్సెస్‌ అయ్యింది కూడా. ఈ తరుణంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్స్‌ విధానాన్ని అమలు చేయబోతోంది.

షెడ్యూల్‌ ప్రకారం.. 
గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో..  గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరుతారు. 

ఉదయం 10 గంటల ప్రాంతంలో పల్నాడు జిల్లా లింగంగుంట్లకు చేరుకుంటారు.

డాక్టర్‌ వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ సెంటర్‌ని పరిశీలించిన అనంతరం.. అక్కడే ఏర్పాటు చేసిన ఫ్యామిలీ ఫిజీషియన్‌ కాన్సెప్ట్‌ స్టాల్స్‌ను పరిశీలించనున్నారు.

కావూరు గ్రామంలో ఏర్పాటు చేసే సభకు హాజరై.. బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

కార్యక్రమం పూర్తయ్యాక.. తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement