మాజీ మంత్రి నారాయణ కార్యాలయంలో ముగిసిన సీఐడీ సోదాలు

AP CID Raids Ended On TDP Leader Narayana Office At madhapur - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అమరావతి భూ కుంభకోణం కేసులో సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. 150 ఎకరాల అసైన్డ్‌ భూముల కొనుగోలుపై సీఐడీ ఆరాతీస్తోంది. టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు చెందిన మాదాపూర్‌లోని ఎన్‌ స్పైరా సంస్థలో సీఐడీ అధికారులు సోదాలు చేపట్టారు. మిలాంట్‌ టవర్‌ పదో అంతస్తులో ఉన్న ఆ కార్యలయంలో రెండు రోజులపాటు కొనసాగిన ఈ సోదాలు బుధవారం ముగిశాయి.

ఈ మేరకు ఎన్‌ స్పైరా సంస్థలో కీలక పత్రాలు, హార్డ్‌డిస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నారాయణ సంస్థల నుంచి రామృష్ణ హౌసింగ్‌ సంస్థలోకి నిధులు మళ్లిన్నట్లు గుర్తించారు. ఈ తనిఖీల్లో 10 మంది సీఐడీ అధికారులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top