
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా సోము వీర్రాజును ప్రకటించిన తర్వాత మొదటసారి శుక్రవారం ఢిల్లీలో పర్యటించారు. పర్యటనలో భాగంగా భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు బీఎల్ సంతోష్, రాంమాధవ్‌లను కలిసి కేంద్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర నాయకత్వానికి సోమువీర్రాజు వివరించారు. (సుజనాకు ఝలక్ ఇచ్చిన ఏపీ బీజేపీ)