ఆదాయం కోసమే దర్శనాలన్నది అవాస్తవం  | Anil Kumar Singhal Comments In Your EO Program | Sakshi
Sakshi News home page

ఆదాయం కోసమే దర్శనాలన్నది అవాస్తవం 

Aug 10 2020 6:19 AM | Updated on Aug 10 2020 6:19 AM

Anil Kumar Singhal Comments In Your EO Program - Sakshi

తిరుమల: టీటీడీ ఆదాయం కోసమే శ్రీవారి దర్శనాలు చేయిస్తోందని మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు లోబడి రోజుకు 12 వేల మందికి దర్శనం కల్పించే ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. తిరుపతిలో పాక్షిక లాక్‌డౌన్‌ కారణంగా స్థానికంగా రోజుకు కేటాయిస్తున్న మూడు వేల ఉచిత దర్శన టోకెన్లను కొంతకాలంగా నిలిపేసినట్టు చెప్పారు. తిరుపతిలో కరోనా కేసులు పెరగడానికి దర్శనాలే కారణమన్న విమర్శల్లో ఏ మాత్రం నిజం లేదన్నారు. ఆదివారం ఆయన యువర్‌ ఈవో కార్యక్రమంలో మాట్లాడారు. 

ఇంకా ఏమన్నారంటే.. 
► టీటీడీ ఉద్యోగుల్లో 743 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, ఇప్పటికే 402 మంది కోలుకున్నారు. 338 మంది చికిత్స పొందుతున్నారు, ముగ్గురు మృతి చెందారు.  
► పద్మావతి అమ్మవారి దర్శనానికి రాలేని భక్తులు ఈ–హుండీ ద్వారా ఆన్‌లైన్‌లో కానుకలు సమర్పించే సదుపాయం కల్పించాం. www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారాగానీ, గోవింద మొబైల్‌ యాప్‌ ద్వారాగానీ భక్తులు కానుకలు చెల్లించొచ్చు.  
► శ్రీవేంకటేశ్వర భక్తి చానల్‌ను యాడ్‌ ఫ్రీ చానెల్‌గా మారుస్తాం. 
► ఎస్వీబీసీ ట్రస్టుకు వచ్చే ఆదరణను బట్టి ఎస్వీబీసీ హెచ్‌డీ చానల్‌ను ప్రారంభించాలని నిర్ణయించాం. 
► త్వరలోనే హిందీ, కన్నడ భాషల్లో ఎస్వీబీసీ ప్రసారాలు చేస్తాం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement