ఐక్యరాజ్య సమితిలో మెరిసిన ఆంధ్రప్రదేశ్ | Sakshi
Sakshi News home page

ఐక్యరాజ్య సమితిలో మెరిసిన ఆంధ్రప్రదేశ్

Published Sun, Sep 17 2023 7:10 PM

Andhra Pradesh Govt School Students In UN Conference - Sakshi

న్యూయార్క్‌: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి 10 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థి బృందం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 2 వారాల పాటు (సెప్టెంబర్ 15 - 28) పర్యటిస్తుండటం ఇదే మొదటిసారి. ఐక్యరాజ్య సమితిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఈ విద్యార్థుల బృందాన్ని అమెరికా అధికారులు వరల్డ్ బ్యాంక్, US డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్, కొలంబియా యూనివర్సిటీ, వాషింగ్టన్ DCలోని వైట్ హౌస్‌ను సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు.

ఇప్పటి వరకు తమ గ్రామాలకు పరిమితమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఈ చిన్నారులు న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగే చారిత్రాత్మక యాక్షన్ ప్యాక్డ్ SDG (సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్) సమ్మిట్‌లో భాగమయ్యే సువర్ణావకాశాన్ని పొందడం ఇదే మొదటిసారి.

ఐక్యరాజ్య సమితిలో సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గురించి మాట్లాడడమే కాకుండా, ఈ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందుతున్న విద్యా సంస్కరణలను కూడా ఈ సధస్సులో ప్రదర్శిస్తారు.

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్ నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా సంస్కరణల అమల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న ద్విభాషా పాఠ్యపుస్తకాలు, టాబ్లెట్‌లు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ఆంగ్ల విద్య, పాఠ్యాంశ సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా విద్యా రంగాన్ని ఎలా మార్చేసిందో పిల్లలు వివరిస్తారు.

ఈ మొత్తం ప్రాజెక్టులో అత్యంత అద్భుతమైన భాగం ఏమిటంటే, ఈ పిల్లలు చాలా నిరాడంబరమైన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. ఈ పిల్లల తల్లిదండ్రులు కొందరు దినసరి కూలీలు కాగా మరికొందరు ఆటో డ్రైవర్లుగా, మెకానిక్‌లుగా, సెక్యూరిటీ గార్డులుగా, లారీ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. "పేదరికం ఎవ్వరికీ నాణ్యమైన విద్యను దూరం చేయకూడదని విశ్వసించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దూరదృష్టి ఉన్న వ్యక్తి వల్లే ఈ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ రోజు అమెరికాలో జరుగుతున్న అత్యున్నత సధస్సులో పాల్గొంటున్నారు.

చదవండి: మానవాభివృద్ధినీ మనం అంగీకరించలేమా?

ఈ అంతర్జాతీయ పర్యటన ప్రధాన లక్ష్యం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిభావంతులైన పిల్లలకు వారి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, చర్చించడానికి, వ్యక్తీకరించడానికి, కొత్త ఆలోచనలను ప్రపంచంతో పంచుకోవడానికి ప్రపంచ వేదికను అందించడమే. ఈ పర్యటన పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతో పాటు అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అంతర్జాతీయ సమావేశాల్లో  ఆత్మవిశ్వాసంతో స్పష్టంగా & నమ్మకంతో మాట్లాడే సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.

మంగా వెంకన్న, సాక్షి

ఇదీ చదవండి: ప్రపంచ చోదక శక్తి యువతే

Advertisement
 
Advertisement
 
Advertisement